నల్గొండ: ఎండలకు పంటలు ఎండిపోతున్నా, కాల్వల నుంచి నీళ్లు రావడం ఆలస్యమవ్వుతుండడంతో రైతులు కాల్వకు గండికొట్టిన ఘటన శుక్రవారం నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.
హాలియా మండలం రాజవరంలో మేజర్‌కాల్వకు రైతులు గండి పెట్టారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలోని కాల్వ కింద 250 ఎకరాల్లో పంటలు నీరు లేక ఎండిపోయే పరిస్థితి నెలకొంది. వర్షాలు పడకపోవడంతో పాటు.. కాల్వ నుంచి నీరు రావడం ఆలస్యం అవుతుండడంతో రైతులు కాల్వకు గండి పెట్టారు.