
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల వెల్లడించిన కానిస్టేబుల్ ఫలితాలలో అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగాలు రాలేదని అభ్యర్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు కానిస్టేబుల్ ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని తెలంగాణ హోంశాఖను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబరు 15కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment