సాక్షి, మంచిర్యాల : రాజీవ్ విద్యా మిషన్(ఆర్వీఎం) ఆధ్వర్యంలో చేపట్టిన ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ మూడున్నర నెలలుగా అభ్యర్థుల ఓపికను పరీక్షిస్తోంది. పాఠశాలల పనిగంటలు పెరిగిన నేపథ్యంలో ఆ బరువును తామెల భరించాలో అర్థం కావడం లేదని ఉపా ధ్యాయులు పేర్కొంటున్నారు. జిల్లాలోని హైస్కూళ్లలో ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయుల నియామకం కోసం ఈ ఏడాది జూలైలో ఆర్వీఎం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆయా ఉపాధ్యాయులను కాంట్రాక్టు పద్ధతిలో ఎంపిక చేస్తామని, సంబంధిత విభాగంలో అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ఆర్ట్ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు చిత్రకళా నైపుణ్యం, క్రాఫ్ట్ ఉపాధ్యాయులు కుట్లు, అల్లికలు, వ్యాయామ ఉపాధ్యాయులు సంబంధిత అంశంలో పిల్లలకు శిక్షణ ఇవ్వాలి.
ఆది నుంచి..
నోటిఫికేషన్ విడుదల నుంచి గందరగోళ పరిస్థితులు నెల కొన్నాయి. స్థానికతపై స్పష్టత ఇవ్వలేదు. మండలం యూ నిట్‌గా స్థానికతను ఆధారం చేసుకొని కొందరు, స్కూల్ కాంప్లెక్స్ యూనిట్‌గా స్థానికతను ఆధారం చేసుకొని కొన్నిచోట్ల ఎంపిక పూర్తిచేశారు. సదరు అభ్యర్థుల వివరాలు జిల్లా ఉన్నతాధికారులకు పంపించారు. అయితే ఈ ప్రక్రి య ముగిసి నెలలు గడుస్తున్నా నియామకం గురించి అభ్యర్థులకు సమాచారం ఇవ్వలేదు. పెరిగిన పనిగంటల బాధ్యతలను ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయులతో సర్దుబా టు చేసుకోవాలని విద్యాశాఖ ఆదేశాల్లో పేర్కొంది.
అయితే ఉపాధ్యాయులే లేనప్పుడు విధులు ఎలా పంచుకుంటారనే ప్రశ్న వ్యక్తమవుతోంది. తమకు నియామకం విషయంలో అధికారిక ప్రకటన చేస్తే ఈ ఎంపిక కోసం ఆగి ఉండాలో లేక మరేదైనా మార్గం చూసుకోవాలో నిర్ణయిం చుకుంటామని అభ్యర్థులు వాపోతున్నారు. నియామకాలు చేపట్టి నిరుద్యోగులను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఆదేశాలు వస్తే నియామకాలు..
ఈ విషయమై రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు ఆఫీసర్ యాదయ్యను సంప్రదించగా.. ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియను హోల్డ్‌లో ఉంచాలని రాష్ర్ట కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో ప్రక్రియను నిలిపి వేశాం. తదుపరి ఆదేశాల ప్రకారం ముందుకువెళ్తామని స్పష్టం చేశారు.
ఖాళీల భర్తీ ఎన్నడో?
Published Wed, Sep 10 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM
Advertisement
Advertisement