మోర్తాడ్(బాల్కొండ): విషవాయువు ప్రభావం తో ముగ్గురు భారతీయ కార్మికులు మృతి చెం దిన ఘటనపై ఒమన్ ప్రభుత్వం తీవ్రంగా స్పం దించింది. షిప్ కంపెనీ నిర్లక్ష్యం వల్లనే భారతీ య కార్మికులు మృతి చెందడంతో, ఈ ఘటనను ప్రభుత్వంపై పడిన మచ్చగా భావిస్తోంది. ఈ క్రమంలో షిప్ కంపెనీపై కేసు నమోదు చేసిన అక్కడి ప్రభుత్వం పరిహారం విషయం తేలిన తరువాతనే మృతదేహాలను స్వస్థలాలకు పంపిం చాలని నిర్ణయించింది.
గత శనివారం రాత్రి ఒమన్‌లోని షిప్ యార్డులో సామగ్రిని లోడింగ్ అన్‌లోడింగ్ చేసే క్రమంలో విషవాయువు ప్రబలి నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌కు చెందిన తిరుమలేశ్, జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాయిపల్లికి చెందిన రమేశ్, తమిళనాడుకి చెందిన మణి మృతి చెందిన విషయం విదితమే.
ఈ మరణాలకు కంపెనీ బాధ్యత వహించాలని ఒమన్ ప్రభుత్వం ఆదేశించిందని అక్కడే షిప్ యార్డులో పని చేస్తున్న మోర్తాడ్‌వాసి కుదురు పాక ప్రదీప్ ‘సాక్షి’కి ఫోన్‌లో వివరించారు. సదరు కంపెనీ అమెరికాకు చెందినది కావటంతో ఆ దేశ విదేశాంగ శాఖ దృష్టికి ఈ ఘటనను ఒమన్ ప్రభుత్వం తీసుకెళ్లిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment