తెలంగాణ భూ సేకరణ బిల్లుకు కేంద్రం ఆమోదం | central government approves Telangana land acquisition bill | Sakshi
Sakshi News home page

తెలంగాణ భూ సేకరణ బిల్లుకు ఆమోదం

Published Tue, May 9 2017 11:42 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

central government  approves Telangana land acquisition bill

న్యూఢిల్లీ: తెలంగాణ భూ సేకరణ చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అనంతరం ఆ బిల్లు ఆమోదం కోసం కేంద్ర హోంశాఖ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వద్దకు పంపింది. రెండు, మూడు రోజుల్లో  భూ సేకరణ బిల్లు-2016పై రాష్ట్రపతి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

కాగా గతంలో ఈ భూ సేకరణ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన కేంద్రం... పలు సవరణలు చేయాల్సిందిగా రాష్ట్రానికి తిప్పిపంపిన విషయం తెలిసిందే. ఆ అభ్యంతరాలను సరిచేసిన తెలంగాణ ప్రభుత్వం మళ్లీ కేంద్రానికి పంపించింది. దీంతో భూసేకరణ బిల్లుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కాగా తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ ఢిల్లీలోనే మకాం వేసి, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షి జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement