తెలంగాణ భూ సేకరణ బిల్లుకు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: తెలంగాణ భూ సేకరణ చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అనంతరం ఆ బిల్లు ఆమోదం కోసం కేంద్ర హోంశాఖ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు పంపింది. రెండు, మూడు రోజుల్లో భూ సేకరణ బిల్లు-2016పై రాష్ట్రపతి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
కాగా గతంలో ఈ భూ సేకరణ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన కేంద్రం... పలు సవరణలు చేయాల్సిందిగా రాష్ట్రానికి తిప్పిపంపిన విషయం తెలిసిందే. ఆ అభ్యంతరాలను సరిచేసిన తెలంగాణ ప్రభుత్వం మళ్లీ కేంద్రానికి పంపించింది. దీంతో భూసేకరణ బిల్లుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ ఢిల్లీలోనే మకాం వేసి, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షి జరిపారు.