పత్తి రైతులకు కేంద్రం అన్యాయం
నీటిపారుదల శాఖ మంత్రి హారీశ్‌రావు
కోరుట్ల: కెన్యా ఒప్పందంతో కేంద్ర ప్రభుత్వం పత్తి రైతులకు తీవ్ర అన్యా యం చేసిందని రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖల మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. సోమవారం కరీంనగర్ జిల్లా కోరుట్ల మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. ఆయన మాట్లాడుతూ కేంద్ర వాణి జ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల కెన్యాలోని నైరోబీలో పత్తి ధర విషయంలో చేసుకున్న ఒప్పందం ప్రభావం రాష్ట్రంలోని పత్తి రైతులపై తీవ్రంగా పడుతుందన్నారు. ఇప్పటికే నానా అవస్థలు పడుతున్న పత్తి రైతులు ఈ ఒప్పందంతో నష్టపోతారన్నారు. ఇలాంటి తప్పుడు ఒప్పందాలతో పత్తి రైతులు ఇబ్బందులు పడకుండా సోయాబీన్, పసుపు, కూరగాయలు సాగుచేసేలా వ్యవసాయాధికారులు ప్రోత్సహించాలని సూచించారు. కేంద్రం అనాలోచితంగా తీసుకున్న ఈ నిర్ణయంపై పునరాలోచన చేయూలని కోరారు.
వచ్చే ఇరవై ఏళ్లు టీఆర్‌ఎస్‌దే అధికారం
మెట్‌పల్లి: టీఆర్‌ఎస్ పార్టీ ప్రజల మద్దతుతో రాబోయే ఇరవై ఏళ్లు అధికారంలో ఉంటుందని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం కమిటీల పాలకవర్గాల ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో ప్రతిపక్షాలు పూర్తిగా ప్రజల మద్దతును కోల్పోతున్నాయన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, కాని ఇప్పుడు టీడీపీ నాయకులు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడం వల్ల ఆయన ఆత్మ క్షోభిస్తుందని అన్నారు.