Minister haris Rao
-
ప్రజల ఉసురు పోసుకోవద్దు
విపక్ష నేతలకు మంత్రి హరీ్‌శ్‌రావు విజ్ఞప్తి జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): కరువు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టులను పూర్తి చేస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుని పాలమూరు జిల్లా ప్రజల ఉసురుపోసుకోవద్దని ప్రతిపక్ష పార్టీలకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విజ్ఙప్తి చేశారు. సోమవారం మహబూబ్‌నగర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు 90 శాతం పనులు పూర్తయ్యాయని, కేవలం రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయని తెలిపారు. ‘మీకు చేతులు జోడించి వేడుకుంటున్నా.. ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించవద్దు’ అని విజ్ఞప్తి చేశారు. ఇప్పటిదాకా కేవలం 60 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని, ఇంకా 40 శాతం పనులు చేపట్టాల్సి ఉందన్నారు. జిల్లాలో మరో 4 లక్షల కొత్త ఆయకట్టు పెంచుతున్నామన్నారు. జీఓ 123 ప్రకారం రైతులకు రెట్టింపు పరిహారం ఇస్తున్నామని, భూ సేకరణ అడ్డుకుని జిల్లా ప్రజల నోట్లో మన్ను కొట్టవద్దని హితవు పలికారు. ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాల్‌రాజు, మర్రి జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. -
పత్తి రైతులకు కేంద్రం అన్యాయం
నీటిపారుదల శాఖ మంత్రి హారీశ్‌రావు కోరుట్ల: కెన్యా ఒప్పందంతో కేంద్ర ప్రభుత్వం పత్తి రైతులకు తీవ్ర అన్యా యం చేసిందని రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖల మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. సోమవారం కరీంనగర్ జిల్లా కోరుట్ల మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. ఆయన మాట్లాడుతూ కేంద్ర వాణి జ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల కెన్యాలోని నైరోబీలో పత్తి ధర విషయంలో చేసుకున్న ఒప్పందం ప్రభావం రాష్ట్రంలోని పత్తి రైతులపై తీవ్రంగా పడుతుందన్నారు. ఇప్పటికే నానా అవస్థలు పడుతున్న పత్తి రైతులు ఈ ఒప్పందంతో నష్టపోతారన్నారు. ఇలాంటి తప్పుడు ఒప్పందాలతో పత్తి రైతులు ఇబ్బందులు పడకుండా సోయాబీన్, పసుపు, కూరగాయలు సాగుచేసేలా వ్యవసాయాధికారులు ప్రోత్సహించాలని సూచించారు. కేంద్రం అనాలోచితంగా తీసుకున్న ఈ నిర్ణయంపై పునరాలోచన చేయూలని కోరారు. వచ్చే ఇరవై ఏళ్లు టీఆర్ఎస్దే అధికారం మెట్పల్లి: టీఆర్ఎస్ పార్టీ ప్రజల మద్దతుతో రాబోయే ఇరవై ఏళ్లు అధికారంలో ఉంటుందని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం కమిటీల పాలకవర్గాల ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో ప్రతిపక్షాలు పూర్తిగా ప్రజల మద్దతును కోల్పోతున్నాయన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, కాని ఇప్పుడు టీడీపీ నాయకులు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడం వల్ల ఆయన ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. -
ఎక్కువ ఆయకట్టుకే తొలి ప్రాధాన్యం
చెరువుల పునరుద్ధరణపై మంత్రివర్గ ఉపసంఘంలో నిర్ణయం స్వచ్ఛందంగా ముందుకు వచ్చే గ్రామాల్లోనూ తొలిదశలో కార్యక్రమం సీఎంకు నివేదించిన అనంతరం మార్గదర్శకాలు డిసెంబర్ నుంచి పనుల ప్రారంభం హైదరాబాద్: గరిష్ట స్థాయిలో ఆయకట్టుకు నీరందించగల చెరువులకే పునరుద్ధరణలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. దీంతోపాటు చెరువుల పునరుద్ధరణకు స్వచ్ఛందంగా ముందుకువచ్చే గ్రామాల్లోనూ తొలిదశలోనే పనులు ప్రారంభించాలని ప్రతిపాదిస్తోంది. పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రెండు, మూడు రోజుల్లో పూర్తి స్థాయి మార్గదర్శకాలను రూపొందించాల ని నిర్ణయించింది. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంపై గురువారం మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేటీఆర్, జగదీశ్వర్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు. రాష్ట్రంలో గుర్తించిన 46 వేల చెరువుల్లో ఏటా తొమ్మిది వేల వరకూ చెరువులను అభివృద్ధిలోకి తేవాలనే కార్యాచరణ ప్రణాళికపై నాలుగున్నర గంటల పాటు చర్చించారు. తొలిదశలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 751 కోట్లతో 1,500 చెరువులను అభివృద్ధి పరిచి... మూడు లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని సమావేశంలో నిర్ణయించారు. ట్రిపుల్ ఆర్ పథకం కింద రూ. 710 కోట్లతో 1,500 చెరువుల మరమ్మతులు చేపట్టి 3.20 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని, ఏఐబీపీ కింద రూ.281 కోట్లతో 44,574 ఎకరాలు కొత్త ఆయకట్టును అభివృద్ధి చేయాలని, జైకా కింద సైతం రూ. 269 కోట్ల వ్యయంతో 27 వేల ఎకరాల కొత్త ఆయకట్టును తీసుకురావాలని నిర్ణయించా రు. ఉపాధిహామీ కింద రూ.4,500 కోట్లతో తొమ్మిది వేల చెరువుల్లో పూడికతీత చేపట్టి.. 1.85 లక్షల ఎకరాలను స్థిరీకరించాలని ప్రతిపాదించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణను ఉద్యమంలా చేపడతామన్నారు. డిసెంబర్ నుంచి పనులు ప్రారంభిస్తామని... ఆయకట్టు, పరివాహకం ఎక్కువగా ఉన్న చెరువులకు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చే గ్రామాల్లో చెరువుల పునరుద్ధరణకు తొలి ప్రాధాన్యం ఇస్తామని, మూడు రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు ఖరారు చేస్తామని చెప్పారు. ‘ఫీజు’, ఇసుకపైనా చర్చ.. ఇదే సబ్ కమిటీ సమావేశంలో ఇసుక విధానం, ఆహార భద్రతా కార్డులు, రుణ మాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర అం శాలపైనా చర్చించారు. రాక్ శాండ్‌ని ప్రోత్సహించేలా కార్యాచరణను సిద్ధం చేయాలనే ప్రతిపాదన వచ్చింది. నామినేషన్‌పై ఇచ్చే పనుల పరిమితిని రూ. లక్ష నుంచి 5 లక్షలకు పెంచే విషయంపైనా చర్చ జరిగింది. కళాశాలలకు బకాయిపడ్డ సుమారు రూ. 1,400 కోట్లను చెల్లించే అంశంపైనా చర్చిం చారు. శుక్రవారం దీనిపై సీఎంతో మాట్లాడాక ఒక నిర్ణయానికి రావాలని సంకల్పిం చారు. రుణమాఫీపై శుక్రవారం బ్యాంకర్లతో మరోమారు సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.