నేడు ఢిల్లీకి సీఈవో రజత్‌ కుమార్‌ | CEO Rajat Kumar going delhi today | Sakshi
Sakshi News home page

నేడు ఢిల్లీకి సీఈవో రజత్‌ కుమార్‌

Published Fri, Oct 5 2018 1:18 AM | Last Updated on Fri, Oct 5 2018 1:18 AM

CEO Rajat Kumar going delhi today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధి కారి (సీఈవో) రజత్‌ కుమార్‌ శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సీఈవో కార్యాలయ వెబ్‌సైట్ల ప్రామాణీకరణ అనే అంశంపై, ఐదు రాష్ట్రాల సీఈవోలతో కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నిర్వహించనున్న సదస్సుకు హాజరు కావడానికే ఢిల్లీకి వెళ్తున్నానని రజత్‌కుమార్‌ సాక్షితో తెలి పారు. ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా రెండో సవరణ కార్యక్రమం కింద వచ్చిన ఓటరు నమోదు దర ఖాస్తులు, అభ్యంతరాల పరిశీలన గురువారంతో ముగిసింది.

ఈనెల 8న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం సమీకరించిన ఈవీఎం యంత్రాల ప్రథమ స్థాయి పరీక్ష(ఎఫ్‌ఎల్‌సీ)లు సైతం గురువారం తో ముగిశాయి. ఇక రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయానికి బీసీ సంక్షేమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వి.సైదాను అదనపు సీఈఓగా, డిప్యూటీ సీఈఓగా (ప్రోటోకాల్‌) శేఖర్‌ అనే మరో అధికారిని నియమిస్తూ సీఈసీ ఆదేశాలు జారీ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement