ముక్కోటి ఏకాదశి సందర్భంగా భార్యాభర్తలు వేములవాడ రాజన్నను దర్శించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు మహిళ మెడలోని గొలుసు లాక్కెళ్లారు.
బోయిన్‌పల్లి (కరీంనగర్): ముక్కోటి ఏకాదశి సందర్భంగా భార్యాభర్తలు వేములవాడ రాజన్నను దర్శించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు మహిళ మెడలోని గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా బోయిన్‌పల్లి శివారులో సోమవారం చోటుచేసుకుంది.
స్థానికంగా నివాసముంటున్న నల్లాల రాజమ్మ(55) భర్తతో కలిసి బైక్‌పై వేములవాడ నుంచి బోయిన్ పల్లి వెళ్తున్న సమయంలో గ్రామ శివారులోకి రాగానే గుర్తుతెలియని ఇద్దరు యువకులు బైక్ పై వచ్చి ఆమె మెడలోని మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో బాధిత మహిళ రెండు తులాల బంగారం చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.