ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా | cheating by name of employment | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా

Published Sat, Mar 7 2015 9:50 PM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM

cheating by name of employment

ఏటూరునాగారం(వరంగల్): ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన ఓ ప్రబుద్ధుడు పోలీసులకు చిక్కాడు. గతంలో ఐదుగురిని మోసగించిన అతడు మరోసారి ప్రయత్నించి పోలీసుల వలలో చిక్కాడు. సీఐ కిషోర్ కుమార్ కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గ్రామానికి గణపురం రాజిరెడ్డి(37) ఉద్యాన శాఖ కాంట్రాక్టు పనులు చేసుకుంటూ గ్రామాల్లో తిరిగేవాడు. ఈ క్రమంలో మంగపేట మండలం కమలాపురంలో జరిగిన ఓ శుభకార్యానికి వచ్చాడు. అక్కడ ఇదే మండలం అబ్బాయిగూడెం గ్రామానికి చెందిన కోరం కిషోర్‌తో పరిచయం ఏర్పడింది. అటవీశాఖలో ఉద్యోగాల కోసం తనతోపాటు నలుగురు స్నేహితులు ప్రయత్నాలు చేస్తున్నామని కిషోర్ రాజిరెడ్డికి చెప్పాడు. ఆ ఉద్యోగాలు ఇప్పించడం తనకు చిటికెలో పని అని చెప్పి ఐదుగురిని రాజిరెడ్డి నమ్మబలికాడు.

 

ఒక్కో ఉద్యోగానికి రూ. 1.50 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు. ముందుగా వారి నుంచి రూ.75 వేల వంతున రూ. 3.50 లక్షలు తన భార్య, బావమరిది బ్యాంకు అకౌంట్లలో నేరుగా వేరుుంచుకున్నాడు. ఏడాది నుంచి ఉద్యోగాల కోసం రాజిరెడ్డి వెనుక ఐదుగురు బాధితులు తిరిగారు. చివరికి మోసం తెలుసుకుని మంగపేట పోలీస్‌స్టేషన్‌లో జనవరి 5న ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మరో ఐదుగురికి ఉద్యోగాలు ఇప్పించాలని కిషోర్‌తో మళ్లీ అతడికి ఫోన్ చేయించారు. కమలాపురం బ్యాంకు వద్దకు శనివారం రాజిరెడ్డి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి వద్ద రూ.20 వేల నగదు, నకిలీ చెక్, సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement