ఆందోళన చేస్తోన్న వారితో మాట్లాడుతోన్న అధికారులు, పోలీసులు
కామారెడ్డి క్రైం: పెట్రోల్ పోయడంలో మొసం జరుగుతున్నదని ఆరోపిస్తూ కామారెడ్డిలోని ని జాంసాగర్ రోడ్‌లో ఉన్న శివ హెచ్‌చ్‌పీ పెట్రోల్‌బంక్‌లో మంగళవారం వాహనదారులు ఆందో ళనకు దిగారు. వివరాలు.. నిజాంసాగర్‌లో రో డ్డులోని జీవదాన్ స్కూల్ పక్కనే ఉన్న పెట్రోల్‌బంక్‌లో పెట్రోల్ పోయించుకునేందుకు మంగళవారం మధ్యాహ్నం తాడ్వాయి మండలం మో తే గ్రామానికి చెందిన రాజేశ్వర్‌రావు, లింగారెడ్డి వచ్చారు. చెరో రూ.200 పెట్రోల్‌ను తమ బైక్‌ల లో పోయించుకున్నారు. సందేహం రావడంతో మరో 2 బాటిళ్లలో పెట్రోల్ పోయించారు. బాటిళ్లలో రావాల్సిన దానికంటే తక్కువ రావడంతో బంక్ సిబ్బందిని నిలదీశారు.
రాజేశ్వర్‌రావుకు బాటిల్‌లలో అరలీటర్, లింగారెడ్డికి 250 ఎంఎల్ తక్కువ వచ్చిందంటూ ఆందోళ న కు దిగారు. సమాచారం తెలుసుకున్న పట్టణ ఎ స్సై యాదగిరిగౌడ్, సివిల్‌సప్లయ్ జిల్లా అధికారి రమేశ్, ఎన్‌ఫోర్సుమెంట్ డిప్యూటీ తహసీల్దార్ నర్సింలు, తూనికలు, కొలతల శాఖ అధికారిని భూలక్ష్మి విచారణ జరిపారు. బాధితుల నుంచి ఫిర్యాదు మేరకు ఐదు లీటర్ల షాంపిళ్లను సేకరించారు. దీంతో పెట్రోలు పోయడంలో అక్రమా లు జరుగుతున్నట్లుగా నిర్ధారణ అయిందని, పెట్రోల్ బంక్ యాజమాన్యంపై కేసు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment