ఖమ్మం జిల్లా తల్లాడ మండలం వెంకటగిరి క్రాస్‌రోడ్డు దగ్గర రసాయనాల లోడ్‌తో వెళుతున్న లారీ అగ్నికి ఆహుతైంది. లారీలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉన్నట్టు సమాచారం. హైదారాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతుండగా విరామం కోసం డ్రైవర్ లారీని ఆపాడు.
ఈ సమయంలో ఉన్నట్టుండి లారీలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే లారీ పూర్తిగా కాలిబూడిదైంది. ఎండ తీవ్రత వల్లే రసాయనాలకు నిప్పంటుకోవచ్చని స్థానికులు అన్నారు. ఈ ప్రమాదంతో రోడ్డువెంట ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది.
రసాయనాల లారీ అగ్నికి ఆహుతి
Published Fri, Apr 25 2014 9:12 AM | Last Updated on Sat, Sep 2 2017 6:31 AM
Advertisement
Advertisement