‘భద్రాద్రి’కి అడ్డంకిని తొలగించండి
కేంద్ర విద్యుత్ మంత్రికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: కొత్తగూడెం జిల్లా మణుగూరులో జెన్‌కో ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్‌ప్లాంటుకు పర్యావరణ అనుమతులిచ్చేందుకు సహకరించాలని కేం ద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయె ల్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చేందుకు చేపట్టిన ఈ విద్యుత్ కేంద్రాన్ని సబ్ క్రిటికల్ పరిజ్ఞానంతో నిర్మించేందుకు నిబంధనలు సడలించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం ఆదివారం పీయూష్ గోయెల్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న థర్మల్ పవర్ ప్రాజెక్టులు, సోలార్ ప్లాంట్లు, ఉదయ్ పథకం, డిస్కంల పనితీరు తదితర అంశాలపై గంటపాటు చర్చించారు.
భద్రాద్రి విద్యుత్ కేంద్ర నిర్మాణం, ముడి యంత్రాల సరఫరా కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌కు రూ.987 కోట్లు చెల్లించామని, భూసేకరణ కోసం రూ.69.5 కోట్లు ఖర్చు చేశామని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర విద్యుత్ శాఖ మార్గదర్శకాలకు లోబడి 12వ పంచవర్ష ప్రణాళిక (2012-17) కాలం ముగిసేలోపే కేవలం 24 నెలల్లో భద్రాద్రి విద్యుత్ ప్లాంటును నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించామని వివరించారు. అరుుతే పర్యావరణ అనుమతులు రాకపోవడంతో నిర్మాణంలో జాప్యం జరుగుతోందన్నారు. రూ.5,044 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టుకు అనుమతులు రాకపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని వివరించారు. దేశవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న మరో 36 సబ్ క్రిటికల్ విద్యుత్‌ప్లాంట్లు 13వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే పూర్తవుతాయని, భద్రాద్రి ప్రాజెక్టును కూడా ఆ కోవలోనే చూడాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
సమావేశ నేపథ్యం..
13వ పంచవర్ష ప్రణాళిక కాలం (2017-2022)లో సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని మాత్రమే అనుమతిం చాలని కేంద్ర విద్యుత్ శాఖ గతంలో తీసుకున్న నిర్ణయం తాజాగా భద్రాద్రి సబ్ క్రిటికల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి అడ్డంకిగా మారింది. దీనివల్ల ప్లాంటుకు పర్యావరణ అనుమతుల జారీని పరిశీలించలేమని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఈ నెల 4న నిర్ణరుుంచిన విషయం తెలిసిందే. పర్యావరణ అనుమతుల కోసం పరిశీలనలో ఉన్న ప్రాజెక్టుల జాబితా నుంచి భద్రాద్రి ప్లాంటు పేరును కూడా తొలగించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్ర విద్యుత్ మంత్రిని కలిశారు.
శాశ్వత బొగ్గు కేటాయింపులు చేయండి
నల్లగొండ జిల్లా దామరచర్లలో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి పవర్ ప్లాంటుకు శాశ్వత బొగ్గు కేటాయింపులు జరపాలని సీఎం కోరా రు. తెలంగాణను విద్యుత్ మిగులు రా ష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకు అనుగుణంగా కేం ద్రం నుంచి సహకరించాలని విజ్ఞప్తి చేశా రు. భద్రాద్రి ప్లాంట్‌కు ప్రత్యేక సడలింపులతో పాటు ఇతర అంశాలపై సీఎం చేసిన విజ్ఞప్తిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ అంశాన్ని పరిశీలించి త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే డిస్కంల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఉజ్వల్ డిస్కంల యోజన (ఉదయ్) పథకంలో చేరాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. సీఎంతో పాటు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, కె.కేశవరావు, వినోద్ కుమార్, బాల్క సుమన్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలచారి, రామచంద్ర తేజోవత్, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఉన్నారు.