మెదక్ (జోగిపేట): మెదక్ జిల్లా జోగిపేట మండలం ఆందోల్ చెరువులో రెండు నెలల పసికందు మృతదేహం లభించింది. గురువారం ఉదయం నీటిపై బాలుని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాలుడు ఎవరు, ఇంతటి దారుణానికి పాల్పడిన వారు ఎవరు అనే వివరాలు ఇంకా తెలియా రావాల్సి ఉంది.