బాల్యవివాహాన్ని అడ్డుకున్న ‘చైల్డ్‌లైన్‌’  | Childline Stoped child marriage | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాన్ని అడ్డుకున్న ‘చైల్డ్‌లైన్‌’ 

Published Fri, Mar 30 2018 1:03 PM | Last Updated on Fri, Mar 30 2018 1:03 PM

Childline Stoped child marriage - Sakshi

తహసీల్దార్‌కు హామీ పత్రం ఇస్తున్న అమ్మాయి తల్లిదండ్రులు

కుల్కచర్ల: అమ్మాయిలకు 18 సంవత్సరాలు నిండక ముందే వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, ఇందుకు సహకరించిన వారిపై చర్యలు తప్పవని తహసీల్దార్‌ శ్రీనివాస్‌ శంకర్, చైల్డ్‌లైన్‌ ప్రతినిధి రాములు హెచ్చరించారు. మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన బాలయ్య, మంగమ్మల కుమార్తె (17)కు మైనారిటీ తీరకుండానే పెళ్లి చేయడానికి నిశ్చయించారు. ఈ విషయం చైల్డ్‌ లైన్‌ ప్రతినిధులకు తెలియడంతో గురువారం స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సహాయంతో బండవెల్కిచర్ల గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు.

పిల్లలకు పెళ్లి వయస్సు రాకముందే వివాహం చేస్తే కలిగే అనర్థాల గురించి వివరించారు. తహసీల్దార్‌ శ్రీనివాస్‌ దగ్గరకు తీసుకొచ్చి వారితో  హమీ పత్రం రాయించుకున్నారు. తమ బిడ్డకు 18 సంవత్సరాలు నిండిన తరువాతనే పెళ్లి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement