ప్రపంచానికి ఇప్పుడు ప్లాస్టిక్ సవాలుగా మారింది. ఎన్ని దేశాలు, ప్రభుత్వాలు ప్లాస్టిక్‌ను నిషేధించినా వాటి వాడకం మాత్రం ఆగట్లేదు. దీంతో పర్యావరణానికి ఎంతో ముప్పు వాటిల్లుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని చిలీకి చెందిన ఇద్దరు ఇంజనీర్లు కరిగిపోయే క్యారీబ్యాగులను తయారు చేశారు. ఇది ప్లాస్టిక్‌కు చెక్ పెడుతుందని చెబుతున్నారు. క్యారీబ్యాగ్‌లను తయారుచేసే సాల్యుబ్యాగ్ కంపెనీ జనరల్ మేనేజర్ రాబర్టో అస్టెటే, మరో మేనేజర్ క్రిస్టియన్ ఆలివేర్స్ కలసి ఈ బ్యాగు వివరాలు వెల్లడించారు. నీటిలో వేసి కలపగానే ఆ బ్యాగు కరిగిపోతుందట. ఈ బ్యాగు పర్యావరణహితంగా ఉంటుందని, ఎలాంటి హానీ కలిగించదని చెబుతున్నారు. వీటి తయారీ ఖర్చు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment