వనస్థలిపురం: చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతూ ఓ యువకుడు పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వైదేహీనగర్‌లో నివాసం ఉండే 20 ఏళ్ల యువకుడు ద్విచక్రవాహనంపై మొదట కమలానగర్‌లో ఓ మహిళ మెడలోంచి చైన్ లాగాడు. అది రోల్డ్‌గోల్డ్ కావడంతో ఆమె ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.
అనంతరం హుడాసాయినగర్‌లో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వద్ధురాలి మెడలోంచి గొలుసు లాగేందుకు ప్రయత్నించి అదుపు తప్పి కింద పడిపోయాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ప్రస్తుతం పోలీసులు ఆ యువకున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
పోలీసుల అదుపులో చైన్‌స్నాచర్
Published Wed, Nov 18 2015 10:09 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
Advertisement
Advertisement