సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 28 మంది ఇన్‌స్పెక్టర్లకు డీఎస్‌పీలుగా పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ శనివారం ఆదేశాలు జారీచేశారు. అదే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు పొందిన 40 మంది డీఎస్‌పీలను ఇన్‌స్పెక్టర్లుగా రివర్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సీని యారిటీలో తమకు అన్యాయం జరిగిందంటూ సుప్రీంకోర్టుకు వెళ్లిన ఇన్‌స్పెక్టర్లకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుని ఈ చర్యలు తీసుకున్నట్లు డీజీపీ తెలిపారు. వీరందరి కీ రెండుమూడు రోజుల్లో కొత్త పోస్టులు ఖరారు కానున్నాయి.
డీఎస్పీలుగా పదోన్నతులు పొందిన ఇన్‌స్పెక్టర్లు ...
ఎవి.రంగారెడ్డి, సి.గాంధీనారాయణ, డి.ఆనంద్‌కుమార్, పి. శ్రీనివాస్‌రెడ్డి, పి.సత్యనారాయణ, సి.మదుమోహన్, వి.రవికుమార్, పి.మనోహర్‌రెడ్డి, ఎస్‌ఎంకె ఇస్మాయిల్, కె.రవీందర్‌రెడ్డి, పి.సుధాకర్, ఎం.శ్రీనివాసులు, ఎం.నర్సింహ్మారెడ్డి, జి.శ్రీ నివాస్‌కుమార్, ఎ.రాములు, బి.అంజయ్య,, పి.కృష్ణమూర్తి, బి.భాస్కర్, ఎం. తిరుపతన్న, ఎన్.భుజంగరావు, కె. శివకుమార్, డి.ప్రతాప, ఎస్.సుధాకర్, ఇ.సత్తన్న, టి.గోవర్దన్, ఎం.నరేందర్‌రెడ్డి, షేక్‌లాల్ అహ్మద్, బీవీ మురళీమనోహర్.
డీఎస్పీ నుంచి సీఐలుగా రివర్షన్ అయిన వారు...
ఎ.బుచ్చయ్య (డీఎస్పీ డీటీసీ, వికారాబాద్), ఎం.వెంకటేశ్వర్లు (డీఎస్పీ డీటీసీ, నల్లగొండ), ఎన్.మల్లారెడ్డి(డీఎస్పీ డీటీసీ, వరంగల్), జె.లన్యోన్య (హైదరాబాద్ ఎస్‌బీ ఏసీపీ), వి.వెంకటేశ్వర్లు (డీఎస్పీ సీఐడీ), నూర్‌మహ్మద్‌ఖాన్(డీఎస్పీ అప్పా), ఐ.వెంకటేశ్వర్లు( డీఎస్పీ ఏసీబీ), కె.రాంచందర్‌రావు(డీఎస్పీ పీటీసీ అంబర్‌పేట్), ఎన్.మహేందర్(ఏసీపీ మహాంకాళి), సి.ప్రభాకర్(డీఎస్పీ వరంగల్), ఎస్‌ఎం సురేంద్రనాథ్ (డీఎస్పీ జెన్‌కో హైదరాబాద్), టి.పెంచలయ్య (డీఎస్పీ సీఐడీ), ఎ.చిట్టిబాబు (డీటీసీ మహబూబ్‌నగర్), జివి శ్యాంసుందర్‌రెడ్డి(సైబరాబాద్ ట్రాఫిక్ ఏసీపీ), కూర సరేందర్ (డీఎస్పీ జనగామ), ఎం.వెంకటేశ్వర్లు (ఏసీపీ పంజగుట్ట), ఎ.బాలకోటి (డీఎస్పీ ఇంటెలిజెన్స్), జె.రామారావు (ఏఏసీసీ సీసీఎస్ సిటీ) కె.కృష్ణ (డీఎస్పీ సీఐడీ), జి.శ్రావణ్‌కుమార్(డీఎస్పీ సూర్యాపేట), పి.భాస్కర్‌రావు (డీఎస్పీ సీఐడీ), పివి మురళీధర్ (డీఎస్పీ సికింద్రాబాద్ రైల్వే), టి.పద్మనాభరెడ్డి (సీపీ ట్రాఫిక్, హైదరాబాద్), ఎం.నతానియల్ (ఏసీపీ ట్రాఫిక్, సైబరాబాద్) టిఎస్.రవికుమార్ (ఏసీపీ సుల్తాన్‌బజార్), డి.వసంత్‌రావు (ఏసీపీ గోపాల్‌పురం), ఎస్.గంగాధర్(ఏసీపీ మీర్‌చౌక్), జి.మనమోహర్(ఏసీపీ ట్రాఫిక్ హైదరాబాద్), టి.సంజీవ్‌రావు (డీఎస్పీ పరకాల), ఎం.రవికుమార్ (డీఎస్పీ టీఎస్‌ఎస్‌పీ వరంగల్) ఎస్.గోద్రు (డీఎస్పీ టీఎస్‌ఎస్‌పీ, వరంగల్), కె.సీతారాములు (డీఎస్పీ డీటీసీ ఆదిలాబాద్), వి.బాలుజాదవ్ (డీఎస్పీ సీఐడీ), పి.సుబ్బరాయుడు(డీఎస్పీ సీఐడీ), కె.నెహ్రూ (డీఎస్పీ పీటీసీ అంబర్‌పేట్; ఎల్.ఆనంద్‌భాస్కర్ (ఏసీపీ వనస్థలిపురం), ఏవీ శ్రీనివాస్(డీఎస్పీ టీఎసెస్‌పీ కరీంనగర్), కె.శ్రీనివాస్‌రావు (డీఎస్పీ సీఐడీ), టి.రాందాస్(డీఎస్పీ ఏసీబీ), హరీష్‌చంద్‌నాయక్(డీఎస్పీ సీఐడీ).
కొత్తగా 134 డీఎస్‌పీ సూపర్ న్యూమరరీ పోస్టులు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 134 సూపర్‌న్యూమరరీ డీఎస్‌పీ స్థాయి పోస్టులను సృష్టిస్తూ హోంశాఖ శనివారం జీవో జారీ చేసింది. అంతేగాక మరో 134 రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను తెలంగాణ స్పెషల్ పోలీసు బెటాలియన్, అంబర్‌పేట సీపీఎల్, జిల్లాల సాయుధ విభాగాలలో గుర్తించనున్నట్టు ఆ జీవో పేర్కొంది. అలాగే రివర్షన్‌పొందిన 42 మంది డీఎస్పీలతోపాటు, మరో 90 మంది ఇన్‌స్పెక్టర్‌లకు ఈ సూపర్ న్యూమరరీ పోస్టుల్లో నియమించనున్నారు. అయితే పదోన్నతుల వివాదానికి తెరదించడానికి సూపర్‌న్యూమరరీ పోస్టులను సృష్టించారని అంటున్నారు. కాగా, సివిల్ పోలీసు విభాగంలోకి బదిలీ కావాలనే లక్ష్యంతో పలువురు టీఎస్‌ఎస్‌పీ, సీపీఎల్, ఆర్మ్‌డ్ రిజర్వుడ్ విభాగాలకు చెందిన ఎస్‌ఐలు ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతులు పొందేందుకు నిరాసక్తతను చూపించారు. దీంతో సాయుధ విభాగాలలో దాదాపు 134 వరకు ఇన్‌స్పెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని గుర్తించి ఈ విభాగాల్లో పదోన్నతుల ప్రక్రియను సరైన గాడిలో పెట్టడానికి హోంశాఖ పూనుకుంది.
సీఐలకు ప్రమోషన్లు... డీఎస్పీలకు డిమోషన్లు
Published Sun, Jul 13 2014 1:45 AM | Last Updated on Sat, Aug 11 2018 8:12 PM
Advertisement
Advertisement