సుప్రీం ఆదేశాలు పట్టించుకోని సీఐడీ
► ఏడాదిలో ఒక్క ఎఫ్‌ఐఆర్ కూడా అప్‌లోడ్ చేయని వైనం
► ప్రత్యేక వెబ్‌సైట్ సైతం రూపొందించుకోలేని దుస్థితి
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక దర్యాప్తు సంస్థలు ఎఫ్‌ఐఆర్ కాపీలను కేసు నమోదు చేసిన 24 గంటల్లోగా అధికారిక వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను నేర పరిశోధన విభాగం (సీఐడీ) ఖాతరు చేయ డం లేదు. ఉగ్రవాదం, తీవ్రవాదం, వ్యభిచా రం, పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించి నవి తప్పా మిగతా నేరాలకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీలను వెబ్‌సైట్లలో అందుబాటు లో ఉంచాలని సుప్రీం గతేడాది సెప్టెంబర్‌లో తీర్పునిచ్చింది. అయితే ఏడాది గడిచినా రాష్ట్ర పోలీస్ శాఖలోని సీఐడీ ఒక్క కేసుకు సంబం« దించిన ఎఫ్‌ఐఆర్ కాపీని కూడా అప్‌లోడ్ చేయలేదు.
తమది ప్రత్యేక నేరాల దర్యాప్తు విభాగమని, అలాంటి నిబంధనలు తమకు వర్తించవంటూ దాటవేస్తోంది. సుప్రీం ఆదేశా ల్లో సీఐడీ విభాగాలు ఎఫ్‌ఐ ఆర్ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదన్న వ్యాఖ్యలు లేవు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దేశవ్యా ప్తంగా జరిగే ప్రతి కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీని 24 గంటల్లో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెస్తోంది. ఎఫ్‌ఐఆర్‌పై గోప్యత పాటించా ల్సిన అవసరం ఏముందన్న దానిపై సీఐడీ ఉన్నతాధికారులు నోరు మెదపడంలేదు.
వెబ్‌సైట్‌కూ దిక్కులేదు..
అన్ని రాష్ట్రాల్లో నేర దర్యాప్తు విభాగాలకు ప్రత్యేకమైన వెబ్‌సైట్లున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ ఏపీ పేరుతో సీఐడీకి వెబ్‌సైట్ ఉండేది. విభజన తర్వాత రాష్ట్ర పోలీస్ శాఖ అధికారిక వెబ్‌సైట్ ఏర్పాటు చేసుకుంది. మూడున్నరేళ్లు గడిచినా సీఐడీ మాత్రం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసుకోలేదు. ఈ వ్యవహారంపై సీఐడీ ఉన్నతాధికారులను వివరణ కోరగా తమకు ప్రత్యేక వెబ్‌సైట్ అవసరం లేదని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.