ఎన్కౌంటర్ చేసినవారికి అవార్డులు వద్దు
న్యూఢిల్లీ : ఫేక్ ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు మంగళవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. పోలీస్ ఎన్‌కౌంటర్లు జరిగిన అన్ని కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిది. ఆయా కేసుల్లో మెజిస్టీరియల్ విచారణ కూడా జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసు ఎన్‌కౌంటర్లపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం... కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
ఎన్‌కౌంటర్లపై నమోదైన కేసులపై సీఐడీ విచారణ జరిపించాలని సూచించిన కోర్టు... ఎన్‌కౌంటర్ వివరాలను రాతపూర్వకంగా లేదా ఎలక్ట్రానిక్ విధానంలో సమర్పించాలని పేర్కొంది. ఎన్‌కౌంటర్లకు సంబంధించిన కేసుల్లో విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వడం కానీ, అవార్డులు ఇవ్వడం కానీ చేయకూడదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.