సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తండ్రి పొంగులేటి రాఘవరెడ్డి ఇటీవల మరణించడంతో ఎంపీతోపాటు ఆయన కుటుంబ సభ్యులను బుధవారం సీఎం కేసీఆర్ పరామర్శించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో సీఎంతోపాటు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌లు కల్లూరుకు వచ్చారు.
అనంతరం నారాయణపురం వెళ్లిన సీఎం కేసీఆర్.. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డి, తల్లి స్వరాజ్యమ్మలను పరామర్శించి.. ప్రగాఢ సంతాపం తెలిపారు. అంతకు ముందు పొంగులేటి తండ్రి రాఘవరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దాదాపు గంటసేపు అక్కడ గడిపిన సీఎం నాయకులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కల్లూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద సీఎంకు మంత్రి తుమ్మల, ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, పాయం వెంకటేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment