సీఎం కేసీఆర్ హామీలు ఏమయ్యాయి : ఉత్తమ్ | CM KCR guarantees what happened: Uttam | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్ హామీలు ఏమయ్యాయి : ఉత్తమ్

Published Thu, Jun 11 2015 11:36 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

CM KCR guarantees what happened: Uttam

బిల్యానాయక్‌తండా (మఠంపల్లి) : తెలంగాణలో అధికారంలోకి వస్తే గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తామని, 3 ఎకరాల భూమి ఇస్తామని గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం  మండలంలోని బిల్యానాయక్‌తండాలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా గిరిజనులకు ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు కాలేదన్నారు. కేవలం మాటకారితనంతోనే కేసీఆర్ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు.

గిరిజనులకు, హరిజనులకు, వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ పాలనలోనే పూర్తి న్యాయం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూక్యా మంజీనాయక్, జిల్లా ప్రణాళికాబోర్డు సభ్యురాలు నీలామంజీనాయక్, సర్పంచ్ నాగమణినవీన్, ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు ధరావత్ నవీన్, నాయకులు రవినాయక్, భాస్కర్ నాయక్, సామ్యానాయక్, బాలు, మోతీలాల్, భోజ్యా, సోమ్లా, డాక్టర్ బాలు, అమర్‌సింగ్, హట్యా, బాబునాయక్  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement