![CM KCR Latest Updates On Coronavirus - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2020/05/18/KCR-SPEECH3.jpg.webp?itok=SEcpC5xH)
సాక్షి, హైదరాబాద్ : ఆటో, టాక్సీ డ్రైవర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం శుభవార్త చెప్పారు. హైదరాబాద్‌లో ఆటోలు, ట్యాక్సీలకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. కేబినెట్ సమావేశం అనంతరం సీఎం మీడియా సమావేశంలో మాట్లాడారు. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నడుస్తాయని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో సిటీ బస్సులను మాత్రం అనుమతించబోమని తేల్చిచెప్పారు. అయితే హైదరాబాద్‌లో ఆటోలు, టాక్సీలకు మాత్రం అనుమతి ఇచ్చారు. ట్యాక్సీ, కారులో ముగ్గురు ప్రయాణికులకు అనుమతిచ్చారు. ఇక ఆటోలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులకు అనుమతి ఇచ్చారు. ఇక ఈనెల 31 వరకూ మెట్రో రైలు సర్వీసులు నడపబోమన్నారు. ఇతర రాష్ట్రాల బస్సులను అనుమతి లేదన్నారు. అలాగే తెలంగాణా బస్సులు కూడా ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లడానికి అనుమతి లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
(చదవండి : తెలంగాణలో మే 31 వరకు లాక్‌డౌన్)
Comments
Please login to add a commentAdd a comment