జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై టీయూడబ్ల్యూజే హర్షం | CM KCR Showers Dussehra Gifts To Journalists | Housing . | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై టీయూడబ్ల్యూజే హర్షం

Published Sat, Sep 30 2017 3:17 AM | Last Updated on Thu, Aug 16 2018 1:18 PM

CM KCR Showers Dussehra Gifts To Journalists | Housing . - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జర్నలిస్టులకు నెలరోజుల వ్యవధిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం చేసిన ప్రకటనపై తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ అధ్యక్షుడు అల్లం నారాయణ, ఉపాధ్యక్షుడు పల్లె రవి, ప్రధాన కార్యదర్శి క్రాంతికిరణ్‌ చంటి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతోపాటు జర్నలిస్టుల నిధి మొత్తాన్ని కూడా పెంచుతామని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీపై ఆనందం వ్యక్తం చేశారు. అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు దక్కుతాయన్న సీఎం ప్రకటన జర్నలిస్టులకు మరోసారి గట్టిగా హామీఇచ్చినట్టు అయిందని  వారు ఆ ప్రకటనలో సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement