
సాక్షి, హైదరాబాద్: మీడియా అకాడమీ భవనాన్ని దసరాలోగా త్వరగా పూర్తి చేసి సీఎం కేసీఆర్‌తో ప్రారంభిస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ.15 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. మంగళవారం నాంపల్లిలోని అకాడమీ భవన నిర్మాణ పురోగతిని ఆర్‌అండ్‌బీ అధికారులు, కాంట్రాక్టర్‌తో అల్లం నారాయణ సమీక్షించారు.
సెప్టెంబర్ చివరి వారంలోగా భవనం పూర్తిచేసి అప్పగించేందుకు ప్రయత్ని స్తామని ఆర్‌అండ్‌బీ అధికారులు హామీ ఇచ్చా రని అల్లం స్పష్టం చేశారు. భవనంలో ఒక ఆడిటోరియం, రెండు తరగతి గదులు, లైబ్రరీ, గ్రామీణ, డెస్క్ విలేకరులకు కోసం ఒక బ్రిడ్జ్ కోర్స్ రూపొందించి సర్టిఫికెట్ కోర్స్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు.