'నియోజకవర్గానికో రెసిడెన్షియల్ స్కూల్'
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఓ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు తెలిపారు. అసెంబ్లీలో బుధవారం చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది కల్లా బీసీల కోసం 119 రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామన్నారు.
అంతకుముందు మైనార్టీ సంక్షేమంపై సభలో ఆయన మాట్లాడుతూ మైనార్టీ సంక్షేమానికి తొలి బడ్జెట్‌లోనే రూ.1030 కోట్లు కేటాయించామన్నారు. ఈ ఏడాది ఆ కేటాయింపులను రూ.1204 కోట‍్లకు పెంచామన్నారు. షాదీముబారక్ పథకం, ఇమామ్, మౌజమ్‌లకు ప్రతి నెల రూ.వేయి చొప్పున భృతితో పాటు మైనార్టీ స్కూళ్లను కూడా ఏర‍్పాటుచేస్తున్నామని చెప్పారు.