
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రైతుబంధు పథకానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కరీంనగర్ జిల్లా నుంచి శ్రీకారం చుట్టనున్నారు. మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్‌లో ఈ నెల 10న పథకాన్ని ప్రారంభించి రైతులకు చెక్కులు అందజేయనున్నారు. హుజూరాబాద్ మండలం చెల్‌పూర్ సమీపంలోని ఇందిరానగర్–శాలపల్లిలో లేదా ధర్మరాజుపల్లిలో సీఎం సభను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, సీపీ కమలాసన్‌రెడ్డి, హుజూరాబాద్ ఆర్డీవో బి.చెన్నయ్య మొద ట హుజూరాబాద్ పట్టణంలోని హైస్కూల్ క్రీడా మైదానాన్ని పరిశీలించారు. అనం తరం మండలంలోని శాలపల్లి, ధర్మరాజుపల్లి గ్రామాల్లో సభ నిర్వహణకు అనువుగా ఉన్న ఖాళీ స్థలాలను సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment