సీఎం సభకు ముమ్మర ఏర్పాట్లు | cm metting to all arrang | Sakshi
Sakshi News home page

సీఎం సభకు ముమ్మర ఏర్పాట్లు

Published Thu, Aug 7 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM

సీఎం సభకు ముమ్మర ఏర్పాట్లు

సీఎం సభకు ముమ్మర ఏర్పాట్లు

ఆర్మూర్‌లో గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న సందర్భంగా జిల్లా యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది.

 ఆర్మూర్ టౌన్: ఆర్మూర్‌లో గురువారం ముఖ్యమంత్రి కే సీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న సందర్భంగా జిల్లా యంత్రాం గం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. పట్టణాని కి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి తాగునీరందించే రక్షిత శుద్ధ జలాల పంపిణీ పథకానికి అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి శంఖుస్థాపన చే యనున్నారు. ఇందుకుగాను శిలాఫలకం, పైలా న్, కాకతీయ కళాతోరణం నిర్మాణ పనులు చు రుకుగా సాగుతున్నాయి. జిరాయత్‌నగర్ జావీ   ద్ భాయ్ మినీ స్టేడియంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ సాగనున్న ప్రధాన రహదారులపై పోలీసులు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అంబేద్కర్ చౌరస్తాను, జావీద్‌భాయ్ మినీ స్టేడియాన్ని పోలీసు వలయంగా మార్చేశారు.

అంగడి బజార్‌లో పార్కింగ్‌కు స్థలాన్ని సన్నద్ధం చేశారు. ము  ఖ్యమంత్రి కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహిం   చారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, డీఎస్‌పీ ఆకుల రాం   రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, కౌన్సిలర్‌లు రమాకాంత్, రమేశ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్‌ఎంబీ రాజేశ్వర్, నాయకులు సంజయ్‌సింగ్ బబ్లూ, యామాద్రి భాస్కర్, మిట్టపల్లి గంగారెడ్డి, నచ్చు చిన్నారెడ్డి, సీహెచ్ విద్యాసాగర్, శ్రీనివాస్, పోల మధుకర్, అర్గుల్ సురేష్, బోండ్ల సంతోష్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
 
నిజామాబాద్ రూరల్ : జిల్లా పర్యటనలో భా గంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ మండలంలోని ఇందూరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గురువారం సాయంత్రం ఆరు గం టలకు సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఎస్‌పీ తరుణ్‌జోషి బుధవారం ఆలయ అభివృ ద్ధి కమిటీ అధ్యక్షుడు నర్సింహారెడ్డితో మాట్లాడారు. శాంతిభద్రతలకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీఎస్‌పీ అని ల్‌కుమార్, నిజామాబాద్ రూరల్ ఎస్‌హెచ్‌ఓ కె. ఆదిరెడ్డి పలువురు పాల్గొన్నారు.
 
భారీ బందోబస్తు
నిజామాబాద్ క్రైం : ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జిల్లాకు వస్తున్న కేసీఆర్ పర్యటన కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశా రు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు 1,200మంది పోలీసులను బందోబస్తు కోసం నియమించారు. జిల్లా పోలీసులతోపాటు, ఆది లాబాద్, మెదక్ జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పించారు. సీఎం హెలికాప్టర్‌లో కాకుం డా రోడ్డుమార్గాన వస్తుండటంతో బాంబుస్క్వా డ్ కల్వర్టులు, అనుమానిత ప్రాంతాలలో ప్రత్యే క తనిఖీలు నిర్వహించాయి. సీఎం వెళ్లే మార్గం లో బుధవారం సాయంత్రం పోలీసులు కాన్వాయ్‌తో రిహార్సల్స్ నిర్వహించారు. సీఎం వాహ నం ఎక్కడి నుంచి ఎలా వెళ్లాలి, క్వానాయ్‌లో ఎవరి వాహనం ఎక్కడ ఉండాలో పోలీసులు ప్రణాళికలు రూపొందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement