కామారెడ్డి: కామారెడ్డి సబ్ డివిజన్ పరిధిలో పోలీసు అధికారులకు, అధికార పార్టీ నేతలకు మధ్య వార్ నడుస్తోంది. కొంతకాలంగా డివిజన్‌లో పనిచేస్తున్న పలువురు అధికారులపై టీఆర్‌ఎస్ గుర్రుగా ఉంది. అధికారులను బదిలీ చేయించడానికి అధికార పక్ష నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కామారెడ్డి నియోజకవర్గంలో ఇద్దరు సీఐలు బదిలీ అయ్యారు. డీఎస్‌పీని సాగనంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. తాజాగా దేవునిపల్లి ఎస్‌ఐ సెలవుపై వెళ్లారు.
వారికి అనుకూలమనే
గత ప్రభుత్వంలో పోలీస్ సబ్ డివిజన్‌లో పోస్టింగులు తెచ్చుకున్న అధికారులు, గతంలో తమకు సహకరించలేద ని, వారిని సాగనంపడం ద్వారా తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని అధికార పార్టీ నేతలు ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. డీఎస్‌పీ సురేందర్‌రెడ్డిని మొదటగా బదిలీ చేయించాలని ప్రయత్నిస్తున్నారని తెలిసింది. భిక్కనూరు, కామారెడ్డి రూ రల్ సీఐలు కాంగ్రెస్ నేతలకు అనుకూలంగా వ్యవహరించారని, వారిపై అధికార పక్షం నేతలు ఆగ్రహంగా ఉన్నారు. వారిని బదిలీ చేయించడానికి చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి.
భిక్కనూరు సీఐ సర్దార్‌సింగ్‌కు ముం దుగా బదిలీ జరిగింది. తర్వాత కామారెడ్డి రూరల్ సీఐ సుభాష్‌చంద్రబోస్ బదిలీ జరిగింది. మొదట్లో కామారెడ్డి పట్టణ సీఐ కృష్ణ బదిలీ జరుగుతుం దని భావించినా, కొంతకాలం కొనసాగించాలని ఆయన అధికార పక్షం నేతలను కోరడంతో బదిలీ ఆగిపోయినట్టు సమాచారం. దేవునిపల్లి ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి బదిలీ జరిగినా, తర్వాత రద్దయింది.
ఆందోళనకు దిగిన నేతలు
ఈనెల 11న రాత్రిపూట క్యాసంపల్లి స్టేజీ సమీపంలోని ఓ దాబాలో కొందరు టీఆర్‌ఎస్ నేతలు మద్యం సేవిస్తుండగా దేవునిపల్లి ఎస్‌ఐ దాడి చేశారు. ఎస్‌ఐ కావాలనే చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఠాణాలో ఆందోళనకు దిగారు. ఆయన వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్‌పీ సురేందర్‌రెడ్డి జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు. టీఆర్‌ఎస్ నేతలు దేవునిపల్లి ఎస్సై బదిలీ విషయంలో పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయి.
ఆ రోజు జరిగిన సంఘటన తో మనస్తాపానికి గురైన దేవునిపల్లి ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి సెలవుపై వెళ్లారు. ఆయన బదిలీ చేయించుకునే ప్రయత్నాలలోనే ఉన్నట్టు తెలుస్తోంది. గత ప్ర భుత్వ హయాంలో డివిజన్‌లోని పోలీసు అధికారులు, అప్పటి అధికార పక్ష నేతలకు అనుకూలంగా వ్యవహరించారని టీఆర్‌ఎస్ నేతలు వారిని టార్గెట్ చేశారని అంటున్నారు. తమకు అనుకూలమైన అధికారులకు పోస్టింగులు ఇప్పించుకోవడం ద్వారా తమ ఆధిపత్యం చాటుకోవాలని భావిస్తున్నారని చెబుతున్నారు.
పోలీస్ X టీఆర్‌ఎస్
Published Mon, Sep 15 2014 2:11 AM | Last Updated on Tue, Aug 21 2018 8:06 PM
Advertisement
Advertisement