బాల్య వివాహాల నిరోధానికి కృషి చేయాలి
Published Wed, Mar 1 2017 10:51 AM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
హన్మకొండ అర్బన్ :
జిల్లాలో బాల్య వివాహాల నిరోధానికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ అమ్రపాలి అన్నారు. ఈమేరకు మంగళవారం కలెక్టరేట్‌లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాల్యవిహాహల నిరోధం, వివాహ రిజిస్ట్రేషన్లపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యవివాహాలు నిరోధించే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయని, అయినా కార్యక్రమం విజయవంతానికి అధికారులు ముందస్తు ప్రణాళికలు, సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.
ఇక నుంచి బాల్యవివాహాల నిరోధానికి మండల స్థాయిలో నోడల్ అధికారిగా ఎస్‌హెచ్‌లను నియమించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతి స్కూల్‌లో 8నుంచి పైతరగతులు చదివే విద్యార్థుల హాజరుపట్ల ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వారి హాజరు తగ్గినట్లయితే ఎందుకు తగ్గింది అనే విషయంపై ఆరా తీసి సంబంధిత జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. అదేవిధంగా గ్రామంలో అంగన్‌వాడీ టీచర్లకు ప్రతి కుటుంబంతో సంబంధాలు ఉంటాయని, అందుకే బాల్యవివాహాలపై సమాచారం ఉన్నట్లయితే వెం టనే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.
లైంగిక దాడులు అరికట్టాలి
పేద, ధనిక, ఆడ, మగ భేదం లేకుండా పిల్లలపై లైంగిక దా డులు జరగుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ విషయంలో అధికారులు మరింత సమర్థవంతంగా పని చేసి దాడులను అరికట్టాలన్నారు. అవసరం మేరకు ప్రభుత్వ హాస్టళ్లలో పూర్తి నిఘా పెట్టాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ వెంక ట మాధవరావు, తరుణి సంస్థ చైర్మన్ మమతారఘవీర్, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ అనితారెడ్డి, ఐసీడీఎస్ పీడీ శైలజ, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement