
సాక్షి, సంగారెడ్డి జిల్లాః కలెక్టర్ హనుమంతరావు మంగళవారం ముత్తంగి గ్రామంలో ఆకస్మిక పర్యటన చేపట్టారు. గ్రామంలో అభివృద్ధి పనులపై ఆరా తీశారు. గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.12న పల్లె నిద్ర, 13న మెగా శ్రమదానం నిర్వహించాలని సూచించారు. మెగా శ్రమదానం కార్యక్రమంలో గ్రామస్తులు ప్రతీఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్.. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ ప్రత్యేకాధికారి శైలజ (హార్టికల్చర్ ఆఫీసర్) కు షోకాస్ నోటీస్ జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment