మహిళా లెక్చరర్‌ను వేధిస్తున్న కాలేజీ డైరెక్టర్
సిద్ధిపేట: మెదక్ జిల్లా సిద్ధిపేటలో మాస్టర్ మైండ్ కాలేజీని విద్యార్థి సంఘాల నేతలు విధ్వంసం చేశారు. మహిళా లెక్చరర్‌ను ఆ కాలేజీ డైరెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి వేధిస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి తనను కొద్ది రోజులుగా వేధిస్తున్నట్లు మహిళా లెక్చరర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన విద్యార్థి సంఘాల నేతలు కాలేజీపై దాడి చేశారు. ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు.
**