వైద్యసేవలు అందిస్తున్న జగిత్యాల రూరల్ సీఐ
రాయికల్(జగిత్యాల): తమ కొడుకు అజ్ఞాతాన్ని వదిలి జనంలోకి రావాలని ఆ వృద్ధ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ఆ వృద్ధ దంపతులకు జగిత్యాలరూరల్ సీఐ శ్రీనివాస్‌చౌదరి కొడుకుగా అండగా నిలుస్తున్నారు. ప్రతీ నెల వైద్యసేవలందిస్తున్నారు. ఎప్పటికప్పకైనా తన కొడుకు ముద్దం లక్ష్మణ్ అజ్ఞాతవసాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తాడని ఆ తల్లిదండ్రులు ఆశతో ఎదురుచూస్తున్నారు.రాయికల్ మండలం కట్కాపూర్‌కు చెందిన ముద్దం స్వామి–ముత్తవ్వలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రమేశ్ ఉపాధి కోసం ముంబయికి వెళ్లగా.. లక్ష్మణ్ అలియాస్ లచ్చన్న ఇరువై ఏళ్ల క్రితం దళంలో చేరారు.
అప్పటి నుంచి కొడుకు ఇంటికి తిరిగి వస్తాడని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. రోజురోజుకు ఆరోగ్యం క్షీణిస్తుండడంతో వారి బాగోగులు చూసుకునేందుకు ఎవరూ లేరు. వీరి పరిస్థితి చూసి చలించిన జగిత్యాలరూరల్ సీఐ శ్రీనివాస్‌చౌదరి వారి పోషణకు ఆర్థికసాయంతోపాటు వైద్యసేవలు అందిస్తున్నారు. ఎప్పటికైనా తన కొడుకు ఇంటికొస్తాడని ఆ వృద్ధులు ఎదురుచూస్తున్నారు. ఆ వృద్ధదంపతులను చూసైనా లక్ష్మణ్ దళం వదిలి తన తల్లిదండ్రుల వద్దకు రావాలని పోలీసులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment