18న రిపోర్ట్ చేయాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలోని కమ్యూనికేషన్ విభాగంలో కానిస్టేబుల్‌గా ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 20 నుంచి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమ వుతాయని టెక్నికల్ సర్వీసెస్ అదనపు డీజీపీ రవి గుప్తా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 9 నెలల పాటు సాగే ఈ శిక్షణకు బేగంపేట్‌లోని పోలీస్ ట్రైనిం గ్ కాలేజీని సిద్ధం చేశామన్నారు. దేహ దారుఢ్య పరీక్ష లకు హాజరైన అభ్యర్థులు జిల్లాలు, యూనిట్లలో 18న ఉదయం ఒరిజినల్ సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయాలన్నా రు. 18న రిపోర్టు చేయలేని వారు 19న బేగంపేట్‌లో ట్రైనింగ్ కాలేజీలో రిపోర్ట్ చేయాలన్నారు. వివరాలకు 040–23286340, 9440627784లో సంప్రదించాలి.
కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల శిక్షణ 20 నుంచి..
Published Fri, Jul 14 2017 1:05 AM | Last Updated on Tue, Sep 5 2017 3:57 PM
Advertisement
Advertisement