కేసీఆర్ ఆశీస్సులు ఎవరికో?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: గులాబీ దళపతి కేసీఆర్ మంత్రివర్గంలో కొలువుదీరే రెండో మంత్రి ఎవరు? మలివిడత లో మంత్రివర్గంలోకి తీసుకునే వారి సంఖ్య ఎంత? ఈ దఫా జరిగే విస్తరణలో ఇందూరుకు చాన్స్ దక్కుతుందా? ఒకవేళ రెండో మంత్రిని తీసుకోవాలనుకుంటే ఆ అవకాశం దక్కేదెవరి కీ? ఇంతకీ సీఎం కేసీఆర్ అంతరంగంలో ఏ ముంది? 24 గంటలు ఎక్కడ విన్నా ఇదే చర్చ. టీఆర్‌ఎస్ ప్లీనరీ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారన్న సమాచారం అధికార పార్టీ ఎమ్మెల్యేలలో ఆశలు రేకెత్తిస్తోంది.
రెండో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందన్న సంగతి అటుంచితే, ఈసారి విస్తరణలో అసలు నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం ఉంటుందా? లేదా? అన్న భావన కూడా పార్టీ శ్రేణులలో వ్యక్తమవుతోంది. రెండోసారి ఎంతమందిని తీసుకుంటారన్న సంఖ్య తేలితే ఈ విషయం తేటతెల్లం కాగలదని అంటున్నారు. ఐదారు రోజులలో మంత్రివర్గ విస్తరణ జరగనుందన్న సంకేతాలు రావడంతో ఆశావహ ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
ఇప్పటికే ‘పోచారం’
సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా 11 మందికి మంత్రులుగా అవకాశం దక్కింది. జిల్లా నుంచి నలుగురైదుగురు ప్రయత్నం చేసినా, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక్కరే వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణం చేశారు. కేబినెట్‌లో బెర్తు కోసం ప్రయత్నిస్తున్నవారిలో ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ రూరల్‌ఎమ్మె ల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్‌ల పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఈసారి విస్తరణలో ఇతర జిల్లాల ప్రాధాన్యాలు, సామాజిక, రాజకీ య ప్రాధాన్యాలు, సీనియారిటీ తదితర అంశాలు కీలకం కాానున్నాయి. మొదట మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్ జిల్లాలతోపాటు జిల్లాకు మంత్రి పదవి వస్తుం దన్న ప్రచారం జరిగింది.
తాజాగా పలు అంశాలను ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉండటంతో ఆశావహులు ఆయా సమీకరణాల వైపు దృష్టి సారించారు. మహ బూబ్‌నగర్‌లో జూపల్లి కృష్ణారావుతోపాటు శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రి పదవి దక్కితే, ఇక్కడ ‘రెడ్డి’ సామాజిక వర్గానికి ఛాన్స్ ఉంటుందంటున్నారు. అక్కడ జూపల్లితోపా టు లక్ష్మారెడ్డికి ఇస్తే, జిల్లాలో గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్‌లో ఎవరో ఒకరికి మంత్రి పదవి ఖాయమన్న చర్చ జరుగుతోంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా రేస్ లో ఉన్నారని తెలుస్తోంది. ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం ఉంది.
సందేహం వెంటాడుతున్నా
జిల్లాకు రెండో మంత్రి పదవి దక్కుతుందా లేదా అన్న సందేహం ఉన్నా, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలందరూ ఎవరికీవారుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉన్నందున అదే సామాజికవర్గానికి చెందిన మరో శాసనసభ్యునికి చాన్స్ దక్కపోవచ్చంటున్నారు. జిల్లాలోని మొత్తం తొమ్మిది అసెంబ్లీ స్థానా లను గెలుచుకున్నందున, ఇద్దరికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని భావిస్తున్నా, ఇది ఇతర జిల్లాలతో ముడిపడిన అంశమని పార్టీ సీనియర్లు చెప్తున్నారు. ఇద్ద రికి మంత్రి పదవి ఇవ్వాలని అధినేత భావిస్తే రెడ్డి నుంచి కాక, ఇతర సామాజిక వర్గాలకు చెందినవారికి అవకాశముంటుందంటున్నారు.