హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చీప్‌లిక్కర్ విధానానికి వ్యతిరేకంగా మంగళవారం కుత్బుల్లాపూర్ మండల ఆఫీసు ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. 'దళితులకు మూడు ఎకరాల భూమి ఎప్పుడిస్తారు?' అని ధర్నాలో పాల్గొన్న కార్యకర్తలు ప్రశ్నించారు. 'సారా- రూ.30.. పప్పు-రూ.130', 'నిత్యావసర ధరలు ఆకాశంలో..కేసీఆరేమో ఫాంహౌస్‌లో'..అనే వాక్యాలు రాసిన ఫ్లకార్డులు చేతబట్టుకొని నినాదాలు చేశారు.