
కాంగ్రెస్, టీడీపీ కనుమరుగు: మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు కనుమరుగవుతున్నాయని, తెలంగాణలో ఇంటి పార్టీగా టీఆర్‌ఎస్ ఈ ప్రాంత అభివృద్ధి కోసం శ్రమిస్తోందని రవాణా మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. సభ్యత్వ నమోదుతో పార్టీకి మరింత బలం చేకూరిందని, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగరేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌కు చెందిన పలువురు కాంగ్రెస్, టీడీపీ నాయకులు శుక్రవారం మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనకు రాజకీయ పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉంవన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు శ్రీశైలం రెడ్డి, సిద్ధారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, సూర్యప్రకాశ్‌లు టీఆర్‌ఎస్‌లో చేరినవారిలో ఉన్నారు.