
బీజేపీలో చేరిన కార్యకర్తలతో ఆచారి
సాక్షి,కల్వకుర్తి రూరల్: రాబోయే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కార్యకర్తలు నిర్విరామంగా కృషి చేయాలని పార్టీ రాష్త్ర ప్రధాన కార్యదర్శి, కల్వకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తల్లోజు ఆచారి పిలుపునిచ్చారు. పట్టణంలోని సాయిబాలాజీ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం బీజేపీ పట్టణ, మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ అభ్యర్థి ఆచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆచారి సమక్షంలో గుండూరుకు చెందిన మాజీ సర్పంచ్ పర్వత్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ రామచంద్రయ్య, వారి అనుచరులు అధికసంఖ్యలో బీజేపీలో చేరారు. వారికి కండువాలు కప్పి ఆచారి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ జెండా పేద ప్రజలకు అండ అన్నారు. పేద ప్రజల సంక్షేమమే నరేంద్రమోదీ ఎజెండా అని చెప్పారు. రాబోయే 25 రోజులు ఎంతో కీలకమైనవని ప్రతి కార్యకర్త ప్రతినిత్యం ప్రతి క్షణం బీజేపీ గెలుపు కోసం కృషి చేయాల్సిన అవసరముందన్నారు. ప్రజల్లోకి వెళ్లి సంక్షేమ పథకాలు వివరించడంతో పాటు సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదాన్ని విస్త్రృతంగా ప్రచారం చేసి కల్వకుర్తిపై కమలం జెండా ఎగరవేయాల్సిన అవసరం ఉందని ఆచారి చెప్పారు. కార్యక్రమంలో నాయకులు శేఖర్‌రెడ్డి, నర్సిరెడ్డి, దుర్గాప్రసాద్, రాఘవేందర్‌గౌడ్, నర్సింహ, కృష్ణాగౌడ్, శేఖర్‌రెడ్డి, విజయ్, శ్రీకాంత్, దామోదర్, బాలకృష్ణ, పెద్దయ్య, అశోక్, సాయి, మల్లేశ్, శివ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment