♦ అధికార పార్టీ అండతో జోరుగా వసూళ్ల దందా..
♦ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిపై కాంగ్రెస్ నేతల ధ్వజం
మెదక్‌టౌన్ : అవినీతి, అక్రమాలకు, కమిషన్ల వసూళ్లకు మెదక్ ఖిల్లాపై ఉన్న హరిత హోటల్ అధికారిక పార్టీ నేతలకు అడ్డాగా మారిందని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కొండన్ సురేందర్‌గౌడ్, తోట అశోక్ ధ్వజమెత్తారు. ఆదివారం మెదక్ పట్టణంలోని రాజీవ్ భవన్ వద్ద వారు విలేకరులతో మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే పద్మనా.. లేక ఆమె భర్త దేవేందర్‌రెడ్డా.. చెప్పాలన్నారు. ఏడుపాయల జాతర కోసం ప్రభుత్వం విడుదల చేసిన రూ. రెండు కోట్లు ఎటుపోయోయే చెప్పాలని, దీనిపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.
అవినీతికి పాల్పడితే కుటుంబ సభ్యులపైనా చర్యలు తప్పవన్న సీఎం కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలన్నారు. డ డిప్యూటీ సీఎం రాజయ్యను అవినీతి, అక్రమాల పేరుతో తొలగించిన సీఎం కేసీఆర్ పద్మాదేవేందర్‌రెడ్డిని కూడా తొలగించి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలపై కేసులు నమోదు చేయాలన్నారు. అలాగే మెదక్ రోడ్డు వెడల్పు వ్యవహరంలో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారం రోజుల్లో డిప్యూటీ స్పీకర్‌ను తొలగించుంటే సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తామని హెచ్చరించారు.
అవినీతి అడ్డా.. మెదక్ ఖిల్లా ..!
Published Mon, Jul 20 2015 2:32 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement