సాక్షి, న్యూఢిల్లీ: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దేశీయ విమాన రాకపోకల విభాగానికి స్వర్గీయ ఎన్.టి.రామారావు పేరుపెట్టడంపై రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు శుక్రవారం నాలుగో రోజు కూడా ఆందోళన చేశారు. జీరో అవర్‌లో దీనిపై కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ ప్రస్తావించేందుకు ప్రయత్నించగా.. నిర్దేశిత నోటీసు ద్వారా ఈ అంశాన్ని లేవనెత్తాలని సభాపతి స్థానంలో ఉన్న ఉప సభాపతి కురియన్ సూచిం చారు.
దీనిపై నోటీసును తాము ఇంతకముందే ఇచ్చామని ఆనందశర్మ పేర్కొంటూ ఈ అంశంపై చర్చ ఒక పద్ధతి ప్రకారం జరగలేదని, సంబంధిత మంత్రి కూడా దీని పై సమాధానం ఇవ్వలేదని అన్నారు. దీంతో ఉపసభాపతి, రాజ్యసభ చైర్మన్ దానిని పరిశీలిస్తారని తెలిపారు. కాగా ఇదే అంశంపై కాంగ్రెస్ సభ్యులు ఇచ్చిన కాలింగ్ అటెన్షన్ మోషన్‌పై సోమ లేదా మంగళవారం చర్చకు వచ్చే అవకాశం ఉంది.
‘ఎన్టీఆర్’ పేరుపై సోమవారం చర్చ!
Published Sat, Nov 29 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM
Advertisement
Advertisement