shamshabad airport name
-
‘ఎన్టీఆర్’ పేరుపై సోమవారం చర్చ!
సాక్షి, న్యూఢిల్లీ: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దేశీయ విమాన రాకపోకల విభాగానికి స్వర్గీయ ఎన్.టి.రామారావు పేరుపెట్టడంపై రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు శుక్రవారం నాలుగో రోజు కూడా ఆందోళన చేశారు. జీరో అవర్‌లో దీనిపై కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ ప్రస్తావించేందుకు ప్రయత్నించగా.. నిర్దేశిత నోటీసు ద్వారా ఈ అంశాన్ని లేవనెత్తాలని సభాపతి స్థానంలో ఉన్న ఉప సభాపతి కురియన్ సూచిం చారు. దీనిపై నోటీసును తాము ఇంతకముందే ఇచ్చామని ఆనందశర్మ పేర్కొంటూ ఈ అంశంపై చర్చ ఒక పద్ధతి ప్రకారం జరగలేదని, సంబంధిత మంత్రి కూడా దీని పై సమాధానం ఇవ్వలేదని అన్నారు. దీంతో ఉపసభాపతి, రాజ్యసభ చైర్మన్ దానిని పరిశీలిస్తారని తెలిపారు. కాగా ఇదే అంశంపై కాంగ్రెస్ సభ్యులు ఇచ్చిన కాలింగ్ అటెన్షన్ మోషన్‌పై సోమ లేదా మంగళవారం చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
టెర్మినల్ పేరు మార్పుపై ఉద్యమిస్తాం: వీహెచ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పార్టీ నాయకులంతా ఒక్కొక్కరూ ఇతర పార్టీల్లోకి వెళుతుండడంతో, ఇక్కడి సెటిలర్లలో కొత్త ఊపు తెచ్చేందుకే చంద్రబాబు కుట్రపూరితంగా శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టించారని కాంగ్రెస్ ఎంపీ వి.హన్మంతరావు ఆరోపించారు. గురువారం ఆయన విజయ్‌చౌక్‌లో మీడియాతో మాట్లాడారు. దేశంలో ఏ విమానాశ్రయానికి రెండు పేర్లు లేవని, కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోక పోతే పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లా స్థాయిలో ఉద్యమాలు రూపొందిస్తామని చెప్పారు. -
తీసేసిన తహసిల్దార్‌గా కూడా దిగ్విజయ్ పనికిరారు: సోమిరెడ్డి
శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్ పేరు మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మండిపడ్డారు. ఎన్టీ రామారావు జాతీయస్థాయి నేత అన్న విషయాన్ని దిగ్విజయ్ గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణలో బడుగు, బలహీనవర్గాల వారికి రాజ్యాధికారం కల్పించింది ఎన్టీఆరేనని సోమిరెడ్డి అన్నారు. తీసేసిన తహసిల్దార్‌గా కూడా పనికిరాని దిగ్విజయ్ సింగ్‌కు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత ఏమాత్రం లేదని చెప్పారు.