సాక్షి, హైదరాబాద్ : మహాకూటమిగా ఎన్నికల్లో కలిసి వెళతామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ కుంతియా అన్నారు. ఈ నెల 9 తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు. ఎవరు ఆందోళన పడొద్దని, సీట్ల సర్దుబాటుపై ఎలాంటి సమస్య లేదన్నారు. గాంధీభవన్‌లో ఇండియన్ ముస్లిం లీగ్ నేతలతో కుంతియా సోమవారం భేటీ అయ్యారు. జనసమితి, సీపీఐలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సీపీఐ డెడ్‌లైన్ తమ దృష్టికి రాలేదని, ఆ పార్టీ నేతలతో మాట్లాడుతున్నామని చెప్పారు. ఇండియన్ ముస్లిం లీగ్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్, ఎంఐఎంలు బీజేపీతో కుమ్మాక్కయ్యాయని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్ బీజేపీతో కలిసిపోతుందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వంలో కూడా టీఆర్‌ఎస్ చేరబోతోందన్నారు.
రిజర్వేషన్‌ల పేరుతో కేసీఆర్ ముస్లింలను మోసం చేశారని ఇండియన్ ముస్లిం లీగ్ నేత అబ్దుల్ ఘనీ అన్నారు. కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని, నాలుగు నెలల్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామని దగా చేశారన్నారు. బడ్జెట్‌లో ముస్లింలకు కేటాయించిన నిధులనే ప్రభుత్వం ఖర్చు చేయలేదన్నారు. లవ్ జిహాద్, గోరక్షక్‌లపేరుతో ప్రధాని మోదీ ముస్లింలను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలపై జరుగుతున్న దాడులపై మోదీని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment