ఎదులాపురం, న్యూస్‌లైన్ : పోలీసు కానిస్టేబుళ్లకు కౌన్సెలింగ్ ద్వారా బదీలీలు నిర్వహించుటకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు ఎస్పీ డాక్టర్ గజరావు భూపాల్ పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా ఒకే పోలీసుస్టేషన్‌లో 5 సంవత్సరాలు దాటిన 215 మంది పోలీసు కానిస్టేబుళ్లతో శుక్రవారం స్థానిక పోలీసు కార్యాలయంలో సమావేశమయ్యారు. త్వరలో బదిలీలు నిర్వహించుటకు ఈ కౌన్సెలింగ్ ద్వారా ముందస్తుగా కానిస్టేబుళ్ల కోరిక మేరకు పోలీసు స్టేషన్లను ఎంపిక చేసుకొనుటకు అవకాశం క ల్పించారు. జిల్లాలో ఎస్పీ మొదటిసారిగా కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు నిర్వహించడంపై జిల్లా పోలీసు అధికారుల సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఎస్పీ మాట్లాడుతూ, ప్రతీ పోలీసు స్టేషన్‌లోని రోజువారీ నేరాల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని పోలీసుల సంఖ్య పెంచుటకు కృషి చేస్తున్నామని చెప్పారు. ట్రాఫిక్ సమస్యలున్న ప్రతీ చోట పోలీసు ఎస్సైలను నియమిస్తామని తెలిపారు. త్వరలో 20 సంవత్సరాలు పూర్తిచేసిన పోలీసు కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించుటకు 3 నెలల శిక్షణకు ఎంపిక చేస్తున్నామని వివరించారు. ఇటీవలే ఖాళీలు ఏర్పడిన హెడ్ కానిస్టేబుళ్లకు, ఏఎస్సైలకు పదోన్నతులు కల్పించే ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, ఆదిలాబాద్ ఏఎస్పీ జోయల్ డేవిస్, ఓఎస్డీ ప్రవీణ్‌కుమార్, మంచిర్యాల డీఎస్పీ ఎం.రమణకుమార్, భైంసా డీఎస్పీ ఆర్.గిరిధర్, నిర్మల్ డీఎస్పీ ఎస్.మాధవ్‌రెడ్డి, కాగజ్‌నగర్ డీఎస్పీ సురేశ్‌బాబు, స్పెషల్ బ్రాంచి ఇన్‌స్పెక్టర్ బి.ప్రవీణ్‌రెడ్డి, కార్యాలయ అధికారి వెంకటరమణ పాల్గొన్నారు.
కౌన్సెలింగ్ ద్వారా కానిస్టేబుళ్ల బదిలీలు
Published Sat, May 31 2014 12:40 AM | Last Updated on Tue, Mar 19 2019 6:03 PM
Advertisement