Edulapuram
-
హుజూరాబాద్‌కు ఎన్నేళ్ల చరిత్ర ఉందో తెలుసా?
సాక్షి, హుజూరాబాద్: హుజూరాబాద్‌కు రెండువేల ఏళ్ల చరిత్ర ఉందని ఔత్సాహిక పురావాస్తు చరిత్ర పరిశోధకుడు ఆర్.రత్నాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన పరిశోధనలో భాగంగా హుజూరాబాద్ రంగనాయకుల గుట్ట దిగువన ఎదులాపురం గ్రామాన్ని కనుగొన్నట్లు తెలిపారు. ఇక్కడ రెగ్యులర్‌గా కనిపించే రోళ్లకు భిన్నంగా ఉన్న వెడల్పాటి రోళ్లు, దంచి నూరడానికి ఉపయోగించిన రోకలి బండతో పాటు, అలంకరణకు ఉపయోగించే మట్టి పూసలు, ఇనుము, ఉక్కు పరిశ్రమ, కుండల పరిశ్రమ, పెద్ద పెద్ద ఇటుకులు, వీరుల విగ్రహాలు, నాగ దేవతలు, భైరవ శిల్పం, మొదలైన అనేక చారిత్రక ఆధారాలను గుర్తించినట్లు వివరించారు. హుజూరాబాద్ పట్టణ శివారులోని రంగనాయకుల గుట్ట పరిసర ప్రాంతాల్లో నవీన శిలాయుగం నుంచి మొదలు శాతవాహనులు, తర్వాత కాలంలో చోటుచేసుకున్న అనేక చారిత్రక ఆధారాలకు సంబంధించిన విశేషాలను బయటపెట్టారు. అరుదైన ‘పాటిగడ్డ’ రంగనాయకుల గుట్ట చుట్టూ పూర్వపు ఎదులాపురం గ్రామం ఉందని, సుమారుగా 80 ఎకరాల్లో పాటిమీద అని పిలిచే ఎత్తైన మట్టి దిబ్బ ఉండేదని, ఇంత విశాలమైన ‘పాటి గడ్డ’ చాలా అరుదని, ఈ ప్రదేశంలో ఇప్పుడు ఉన్నట్లే నాడు కూడా అన్ని వృత్తుల వారితో కలిసి జీవించిన పెద్ద గ్రామం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. దీనినే ఇప్పుడు హుజూరాబాద్ అని పిలుచుకుంటున్నట్లు తెలిపారు. ఇంత పెద్ద గ్రామానికి తాగు, సాగునీరు అందించిన ఏరు ప్రవాహం పాటి మీద నుంచి ప్రవహిస్తుందని, సమీపంలో నాగుల చెరువు కూడా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. అనేక వృత్తుల వారు జీవించిన ఇంత పెద్ద గ్రామానికి వైద్యులు కూడా అవసరమే అని, అందుకే ఇక్కడ సాధారణ రోళ్లకు భిన్నంగా పరుపు బండలపై వరుసగా మూడు రోళ్లు ఉన్నాయని, ఇవి లోతు తక్కువగా ఉండటంతో పాటు వెడల్పు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. వీటిని ఆయుర్వేద వైద్యం కోసం మందుల తయారీకి ఉపయోగించి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. రంగనాయకుల గుట్ట వద్ద లభించిన చిట్టెపు రాళ్లను చూపుతున్న రత్నాకర్‌రెడ్డి నూరడానికి, దంచడానికి ఉపయోగించే రోకలి బండ ఒకటి లభించగా, ఇటువంటి రోళ్లను గతంలో హనుమకొండలోని అగ్గలయ్య గుట్టపై గుర్తించినట్లు రత్నాకర్‌రెడ్డి తెలిపారు. పాటి మీద చిట్టెపు రాళ్లు దండిగా ఉన్నాయని, ఇనుమును సంగ్రహించి పోత పోసేటప్పుడు మిగిలిన వ్యర్థ పదార్థాలను చిట్టెపు రాళ్లు అంటారని అన్నారు. ఈ ప్రాంతంలో రెండు వేల ఏళ్ల కిందటే ఇనుము, ఉక్కు పరిశ్రమ ఉందని తన పరిశోధనలో వెల్లడైనట్లు తెలిపారు. పంటలు పండించడంతో పాటు, ధాన్యం నిల్వ చేసిన పెద్ద పెద్ద కాగులు ఇక్కడ లభ్యమైనట్లు పేర్కొన్నారు. చక్రం మీద తయారు చేసి బాగా కాల్చిన నాణ్యమైన ఎరుపు, నలుపు, బూడిద, గోధుమ రంగు మట్టి పాత్రల ఆనవాళ్లు ఇక్కడ విస్తారంగా కనిపించాయన్నారు. మంచి ఆకృతి గల ఎరుపు రంగు మట్టి పూసలతో పాటు రంగు రాళ్లు కనిపించాయని, దీనిని బట్టి పెద్ద రాతియుగము నాటి నుంచి మొదలు ప్రజలు అలంకార ప్రియులనీ తెలుస్తోందని చెప్పారు. పాటి మీద బరువైన పెద్ద పెద్ద ఇటుకలతో నిర్మాణాలు చేశారని, పై కప్పునకు గూన పెంకులు ఉపయోగించారని, వీటితో పాటు తేలికైన ఇటుకలు కూడా దర్శమిచ్చాయని వివరించారు. హనుమాన్ గుడి పక్కన గల పొలంలో ఓ వీరుడి విగ్రహం ఉందని, కాకతీయుల కాలంలో వీరుల ఆరాధన ఎక్కువగా కనిపిస్తుండటం విశేషమని, పాటి మీద పూర్వపు శిథిల ఆలయం, హనుమాన్ గుడి ఉందని, గుట్ట వెనుక నుంచి వెళ్లే దారి పక్కన గుట్ట కింద విడిగా ఉన్న ఒక బండకు భైరవ శిల్పాన్ని చెక్కారని వివరించారు. స్థానిక రైతులు ఇచ్చిన సమాచారంతో పురావాస్తు శాఖ గతంలో ఇక్కడ రెండు కుండలను స్వాధీనం చేసుకుందని, ఇప్పటికీ పాటిగడ్డ అనేక చారిత్రక ఆధారాలతో నిండి ఉందన్నారు. పురావాస్తు శాఖ వారు ఇక్కడ తవ్వకాలు జరిపితే ఎన్నో చారిత్రక విషయాలు బయటపడే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ఊరు ఊరంతా ఊరి బయటకు..
-
కార్మిక సం‘క్షామం’
ఎదులాపురం : కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నా అవి కార్మికుల దరి చేరడం లేదు. పర్యవేక్షించే వారు కరువవడంతో కొన్నేళ్లుగా పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. జిల్లాలోని పలుకార్మిక శాఖ కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఉంది. కీలకమైన కార్మిక శాఖ సహాయ కమిషనర్లతోపాటు కింది స్థాయి ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా కార్మిక శాఖ కార్యాలయాలు 8 ఉన్నాయి. జిల్లా కేంద్రంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్(డీసీఎల్)తోపాటు సహాయ కార్మిక కమిషనర్, ఇద్దరు లేబర్ ఆఫీసర్లు ఉండాలి. అదే విధంగా తూర్పు జిల్లా పరిధిలో మంచిర్యాలకు సహాయ కార్మిక శాఖ కమిషనర్(ఏసీఎల్), ఇద్దరు కార్మిక శాఖ అధికారి పోస్టులు ఉన్నాయి. ఇచ్చోడ, నిర్మల్, భైంసా, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, ఉట్నూర్‌లో కార్మిక శాఖ కార్యాలయాలున్నాయి. ఈ కార్యాలయాల్లో కార్మిక శాఖ అధికారులు విధులు నిర్వహిస్తారు. ఖాళీగా పోస్టులు పలు కార్యాలయాల్లో పోస్టులు ఖాళీగా ఉండడంతో క్షేత్రస్థాయిలో కార్మిక సంక్షేమ పథకాల గురించి కార్మికులకు అవగాహన కరువవుతోంది. ఆదిలాబాద్, మంచిర్యాల డి విజన్ పరిధిల్లో కీలకమైన సహాయ కార్మిక శాఖ కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆదిలాబాద్ సహాయ కార్మిక శాఖ కమిషనర్ పోస్టు జులై 1, 2012 నుంచి భర్తీ కాకపోగా, మంచిర్యాల సహాయ కార్మిక శాఖ కమిషనర్ పోస్టు ఆగస్టు 1, 2013 నుంచి భర్తీకి నోచుకోవట్లేదు. కార్మిక సంక్షేమం కోసం కీలకంగా భావించే ఈ పోస్టులతోపాటు బెల్లంపల్లి, ఉట్నూర్‌లలో సహాయ కార్మిక శాఖ అధికారుల(ఏఎల్వో) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బెల్లంపల్లి కార్యాలయంలో ఆగస్టు 27, 2013 నుంచి, ఉట్నూర్‌లో సెప్టెంబర్ 3, 2013 నుంచి ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఇచ్చోడ, భైంసాలలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇచ్చోడ కార్యాలయంలో జులై 16, 2012 నుంచి, భైంసా కార్యాలయంలో అక్టోబర్ 14, 2013 నుంచి ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో కార్మికులకు అవగాహన కరువు జిల్లాలో ప్రాధాన్యత గల రెండు సహాయ కార్మిక శాఖ కమిషనర్ పోస్టులు, బెల్లంపల్లి, ఉట్నూర్, ఇచ్చోడ, భైంసా కార్మిక శాఖ కార్యాలయాల్లో ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉండడంతో కార్యాలయాల్లో ఉన్న మిగితా సిబ్బంది అదనపు పనులు చేయాల్సి వస్తోంది. దీంతో వారిపై పనిభారం ఎక్కువవుతోంది. అధికారులు కార్యాలయాలకే పరిమితం అవుతుండడంతో క్షేత్ర స్థాయిలో కార్మికులకు అవగాహన కరువవుతోంది. ఆయా అధికారుల పరిధిలోని పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ కార్మికులకు ప్రయోజనాలు కలిగేలా చుడాలి. కార్మిక శాఖలో పోస్టులు ఖాళీగా ఉండడంతో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ, కార్మిక సంక్షేమ పథకాల ప్రచారం కరువై కార్మికులకు సరైన న్యాయం జరగడం లేదు. బాల కార్మికులను పట్టించుకున్న దాఖలాలు లేవు. హోటళ్లు, దుకాణాలు తదితర వ్యాపార ప్రదేశాల్లో బాల కార్మికులు నిత్యం దర్శనమిస్తున్నారు. బాల కార్మికులను నివారించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. ప్రభుత్వం పట్టించుకోవాలి కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కార్మిక వర్గాలు పేర్కొంటున్నాయి. పని భారం ఎక్కువగా ఉండడంతో కార్యాలయాల్లోనే విధులు నిర్వహించాల్సి వస్తోందని ఉద్యోగులు తెలుపుతున్నారు. ప్రభుత్వం ఖాళీలను పూర్తి స్థాయిలో భర్తీ చేసి కార్మికుల ప్రయోజనాలను కాపాడాలి. సంక్షేమ పథకాలు కార్మికులకు అందేలా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులకు ఉంది. -
నామినేటెడ్ పోస్టుల్లో దళితులకు ప్రాధాన్యం ఇవ్వాలి
ఎదులాపురం : జిల్లాలోని నామినేటెడ్ పోస్టుల నియామకంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకుడు, జిల్లా అధ్యక్షుడు భోజనం రాములు, గ డుగు గంగన్న కోరారు. సోమవారం ఆదిలాబాద్‌లోని ప్రింట్ మీడియా ప్రెస్‌క్లబ్‌లో విలేకరులు సమావేశంలో వారు మాట్లాడారు. అర్హులైన దళితులకు మూడు ఎకరాల భూమి, పక్కా ఇళ్లు లేనివారికి రూ.మూడు లక్షలతో ఇంటి నిర్మాణం చేపట్టేలా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చే శారు. ఎన్ఎస్ఎఫ్డీసీ పథకాన్ని పునఃప్రారంభించి బ్యాంక్ కన్సెంట్ లేకుండా రుణాలందించాలని కోరారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని ప్రతీ మండలంలో కొత్త కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 10న తాంసి, తలమడుగు మండల కమిటీలను, 11న జైనథ్, బేల మండల కమిటీలను ఎన్నుకోనున్నట్లు చెప్పారు. కమిటీల ఎన్నికలకు అంబేద్కర్ వాదులందరూ హాజరుకావాలని కోరారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మునీశ్వర్ గౌతం, నాయకులు రత్నాల పొచ్చన్న, ఎ.అశోక్, ఎం.రఘు, అల్లకొండ గంగన్న, పాటిల్ సంతోష్ పాల్గొన్నారు. -
కౌన్సెలింగ్ ద్వారా కానిస్టేబుళ్ల బదిలీలు
ఎదులాపురం, న్యూస్‌లైన్ : పోలీసు కానిస్టేబుళ్లకు కౌన్సెలింగ్ ద్వారా బదీలీలు నిర్వహించుటకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు ఎస్పీ డాక్టర్ గజరావు భూపాల్ పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా ఒకే పోలీసుస్టేషన్లో 5 సంవత్సరాలు దాటిన 215 మంది పోలీసు కానిస్టేబుళ్లతో శుక్రవారం స్థానిక పోలీసు కార్యాలయంలో సమావేశమయ్యారు. త్వరలో బదిలీలు నిర్వహించుటకు ఈ కౌన్సెలింగ్ ద్వారా ముందస్తుగా కానిస్టేబుళ్ల కోరిక మేరకు పోలీసు స్టేషన్లను ఎంపిక చేసుకొనుటకు అవకాశం క ల్పించారు. జిల్లాలో ఎస్పీ మొదటిసారిగా కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు నిర్వహించడంపై జిల్లా పోలీసు అధికారుల సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ, ప్రతీ పోలీసు స్టేషన్‌లోని రోజువారీ నేరాల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని పోలీసుల సంఖ్య పెంచుటకు కృషి చేస్తున్నామని చెప్పారు. ట్రాఫిక్ సమస్యలున్న ప్రతీ చోట పోలీసు ఎస్సైలను నియమిస్తామని తెలిపారు. త్వరలో 20 సంవత్సరాలు పూర్తిచేసిన పోలీసు కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించుటకు 3 నెలల శిక్షణకు ఎంపిక చేస్తున్నామని వివరించారు. ఇటీవలే ఖాళీలు ఏర్పడిన హెడ్ కానిస్టేబుళ్లకు, ఏఎస్సైలకు పదోన్నతులు కల్పించే ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, ఆదిలాబాద్ ఏఎస్పీ జోయల్ డేవిస్, ఓఎస్డీ ప్రవీణ్‌కుమార్, మంచిర్యాల డీఎస్పీ ఎం.రమణకుమార్, భైంసా డీఎస్పీ ఆర్.గిరిధర్, నిర్మల్ డీఎస్పీ ఎస్.మాధవ్‌రెడ్డి, కాగజ్‌నగర్ డీఎస్పీ సురేశ్‌బాబు, స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ బి.ప్రవీణ్‌రెడ్డి, కార్యాలయ అధికారి వెంకటరమణ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ కార్యక ర్తల ఘర్షణ
ఎదులాపురం, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో కలి సికట్టుగా పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తల్లో మరోసారి వర్గ విభేదాలు బయట పడ్డాయి. బుధవారం డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి నివాసానికి వచ్చిన ఎన్ఎస్యూఐ నాయకులు సీఆర్ఆర్ వర్గం నాయకులతో ఘర్షణకు దిగారు. ఇరువర్గాల నాయకులు పరస్పరం దాడికి పాల్పడ్డా రు. ఈ ఘర్షణలో సీఆర్ఆర్ వర్గం నాయకుడు తిప్ప నారాయణ గాయాలపాలై రిమ్స్ ఆస్పత్రి లో చేరాడు. కౌన్సిలర్ టిక్కెట్టు తమకు రాకపోవడానికి నారాయణనే కారణమని ఆరోపిస్తూ ఎన్ఎస్యూఐ నాయకులు ఆయనపై దాడికి పాల్పడ్డారని సీఆర్ఆర్ వర్గం నాయకులు పేర్కొం టున్నారు. మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి విభేదాలు బయటకు రాకుండా ఉన్న సీఆర్ఆర్, భార్గవ్ దేశ్‌పాండే వర్గం నాయకు లు మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్కు అనుకూలంగా వెలువడిన వెంటనే ఇరువర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగడం చర్చనీ యాశంగా మారింది. వర్గవిభేదాలు బయటకు రాకుండా ఎన్నికల్లో ప్రచారం నిర్వహించినా కాం గ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఘర్షణకు పాల్ప డం, కార్యకర్తకు గాయాలై రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందడంతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే దాడిలో గాయపడి రిమ్స్‌లో చికిత్స పొందుతున్న నారయణను పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.