ఎదులాపురం : జిల్లాలోని నామినేటెడ్ పోస్టుల నియామకంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం దళితులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకుడు, జిల్లా అధ్యక్షుడు భోజనం రాములు, గ డుగు గంగన్న కోరారు. సోమవారం ఆదిలాబాద్‌లోని ప్రింట్ మీడియా ప్రెస్‌క్లబ్‌లో విలేకరులు సమావేశంలో వారు మాట్లాడారు.
అర్హులైన దళితులకు మూడు ఎకరాల భూమి, పక్కా ఇళ్లు లేనివారికి రూ.మూడు లక్షలతో ఇంటి నిర్మాణం చేపట్టేలా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చే శారు. ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ పథకాన్ని పునఃప్రారంభించి బ్యాంక్ కన్సెంట్ లేకుండా రుణాలందించాలని కోరారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని ప్రతీ మండలంలో కొత్త కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ నెల 10న తాంసి, తలమడుగు మండల కమిటీలను, 11న జైనథ్, బేల మండల కమిటీలను ఎన్నుకోనున్నట్లు చెప్పారు. కమిటీల ఎన్నికలకు అంబేద్కర్ వాదులందరూ హాజరుకావాలని కోరారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మునీశ్వర్ గౌతం, నాయకులు రత్నాల పొచ్చన్న, ఎ.అశోక్, ఎం.రఘు, అల్లకొండ గంగన్న, పాటిల్ సంతోష్ పాల్గొన్నారు.
నామినేటెడ్ పోస్టుల్లో దళితులకు ప్రాధాన్యం ఇవ్వాలి
Published Tue, Jul 8 2014 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM
Advertisement
Advertisement