Gajaravu Bhopal
-
వనం వీడండి..
ఆదిలాబాద్ టౌన్ : మావోయిస్టులు వనం వీడి జనంలోకి రావాలని జిల్లా ఎస్పీ గజరావు భూ పాల్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పో లీసు కార్యాలయంలో శనివారం లొంగిపోయిన మావోయిస్టు మంగి దళ సభ్యుడు సిడాం లక్ష్మణ్ అలియాస్ సురేందర్‌కు సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎస్పీ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఖానాపూర్ మండలంలోని కొలాంగూడ (సోమవార్‌పేట్)కు చెందిన సిడాం లక్ష్మణ్ అలియాస్ సురేందర్ కట్టెలు, చేపలు అమ్ముతూ జీవించేవాడు. ఆ సమయంలో కడెం మండలం గంగాపూర్ గ్రామస్తుడు కంది రవి (మంగిదళ సభ్యురాలు కంది లింగవ్వ భర్త) కొలాంగూడకు చెక్కల కోసం వస్తుండడంతో పరిచయం ఏర్పడింది. నెలకు రూ.20 వేల జీతం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఈ ఏడాది జూలై 1న గుడుంబా తాగించి తన మోటార్‌సైకిల్‌పై మంగి ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అతనికి తెలియకుండానే దళంలో చేరిన లక్ష్మణ్.. తాను మోసపోయానని గ్రహించి కలిసిన వారికి తన గోడు వెలిబుచ్చాడు. అయినా ఎలాంటి ప్రయోజనమూ లేకుండాపోయింది. దళం ప్రతినిధులైన శోభన్ అలియాస్ చార్లెస్, జ్యోతి అక్కతో ఉండిపోయాడు. జూలై 3న ఉదయం పది మంది దళ ప్రతినిధులతో కలిసి పరేడ్ చేసిన అనంతరం గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి 17 రోజుల తర్వాత బండి ప్రకాష్ లక్ష్మణ్‌కు బ్యాగ్, ప్లాస్టిక్ కవర్, వాటర్‌క్యాన్, గొడుగు, నాటు తుపాకీ అందజేశారు. జూలై 31న కాసిపేట మండలంలోని దేవాపూర్ దగ్గరలోని కుర్రెఘాట్ అడవిలో దళంతో కలిసి ఉదయం 9 గంటల ప్రాంతంలో వంట చేస్తుండగా లొంగిపోవాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దళ సభ్యులు మొదటిసారి కాల్పులు జరపగా, పోలీసులు సైతం కాల్పులు ప్రారంభించారు. దీంతో వారు పారిపోయారు. రెండోసారి సెప్టెంబర్ 14న తిర్యాణి మండలంలోని పంగిడి మాదారం అడవుల్లో ఎదురుకాల్పులు జరగగా, లొంగిపోవాలని చెప్పగా లక్ష్మణ భయపడి తుపాకీ, డ్రెస్‌ను పడేసి రాత్రంతా చెట్టుపై కూర్చున్నాడు. దళం నిర్దేషించిన ప్రదేశానికి వెళ్లకుండా వట్టివాగు గ్రామానికి చేరుకుని అక్కడి నుంచి లారీలో ఇంటికి వచ్చాడు. ఇంటికి చేరుకున్న అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి జరిగిన సంఘటనను వివరించాడు. శనివారం లొంగిపోయినట్లు ఎస్పీ చెప్పారు. మాయమాటలు చెప్పి అమాయక గిరిజన యువకులు మావోయిస్టులు దళంలోకి చేర్పిస్తున్నారని, వారి మాటలు నమ్మి యువకులు మోసపోవద్దని ఎస్పీ సూచించారు. మావోయిస్టులెవరైనా లొంగిపోవాలని నిర్ణయించిన వెంటనే 9440795000 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. లక్ష్మణ్‌కు ప్రభుత్వం నుంచి రూ. లక్ష ఆర్థిక సహాయం అందించేందుకు ప్రతిపాదనలు పంపించినట్లు వివరించారు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ (పరిపాలన) పనసారెడ్డి పాల్గొన్నారు. -
పోలీస్ (మిస్) ఫైర్..!
ఎస్సై చేతిలోని రివాల్వర్ మిస్‌ఫైర్ అయింది. పట్టణంలోని లాడ్జిలో స్నేహితులతో కలిసి విందు చేసుకుంటుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో లాడ్జిలో పనిచేస్తున్న సర్వర్‌బాయ్ కాలికి స్వల్ప గాయమైంది. సంఘటన వివరాలిలా ఉన్నాయి. చర్యలు తీసుకుంటాం.. - ఎస్పీ పట్టణంలోని మయూరి ఇన్ లాడ్జిలో జరిగిన రివాల్వర్ మిస్‌ఫైర్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ గజరావు భూపాల్ పేర్కొన్నారు. ఎస్పీ సోమవారం రాత్రి నిర్మల్‌లోని మయూరి ఇన్ లాడ్జిలో సంఘటన జరిగిన గదిని పరిశీలించారు. అనంతరం ఆయన డీఎస్పీ మాధవరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. లా డ్జిలో రెండు రౌండ్ల కాల్పులు జరిగిన మాట వాస్తవమేనన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలుతీసుకుంటామని పేర్కొన్నారు. నిర్మల్ అర్బన్ : కరీంనగర్ జిల్లా రా యికల్ ఎస్సై రాములు నాయక్ ఆది వారం నిర్మల్‌కు వచ్చారు. అనంతరం తన స్నేహితులైన నిర్మల్ డివిజన్‌కు చెందిన కొందరు ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, ఎంఈవోలతో కలిసి కుంటాల జలపాతానికి విహార యాత్రకు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపారు. అక్కడి నుంచి రాత్రి నిర్మల్‌లోని మ యూరి ఇన్ లాడ్జి లో 212 నంబర్ గదిలో దిగా రు.రాత్రి స్నేహి తులతో కలిసి విం దు చేసుకున్నారు. సుమారు 11గంటల సమయంలో రివాల్వర్ కిందపడి పేలింది. ఈ ఘటనలో మద్యం సీసాలు పగిలినట్లు సమాచారం. అదే సమయంలో గదిలోకి సర్వర్ బాయ్ బాలు వచ్చాడని, బుల్లెట్‌తో దెబ్బతిన్న గచ్చు బాలు కాలికి గుచ్చుకొని స్వల్ప గాయమైందని పోలీసులు తెలిపారు. కాగా, రాయికల్ ఎస్సైరాములు నాయక్ ఉన్న గది.. నిర్మల్ డివిజన్లోని ఓ మండల ఎంపీడీవో పేరిట బుక్ చేసినట్లు లాడ్జి రికార్డుల్లో ఉంది. ఆదివారం మధ్యాహ్నమే ఈ గది బుకింగ్ చేసినట్లు రికార్డుల ఆధారంగా తెలుస్తోంది. పోలీసుల విచారణ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. సోమవారం సాయంత్రం డీ ఎస్పీ మాధవ్‌రెడ్డి లాడ్జిలోని 212 గదిలోకి వెళ్లారు. బుల్లెట్‌తో దెబ్బతిన్న నేల, గదిని పరిశీలించారు. లాడ్జి నిర్వాహకులు, అక్కడ పనిచేసే సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న ఎస్సై రివాల్వర్ కిందపడడంతోనే మిస్‌ఫైర్ అయి ఉంటుం దని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. డీఎస్పీ వెంట రూరల్ సీఐ రఘు, పట్టణ ఎస్సై రాంనర్సింహారెడ్డి ఉన్నారు. ఘటనపై అనుమానాలు.. గదిలో ఉన్న ఇద్దరి మధ్య గొడవ జరగడంతోనే ఫైర్ జరిగి ఉంటుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా రు. గదిలో సుమారు ఐదుగురు ఉన్న ట్లు సమాచారం. అంతేకాకుండా సర్వ ర్ బాయ్‌పై ఆగ్రహంతో ఫైర్ చేసి ఉం టారనే అనుమానాలూ వినిపిస్తున్నా యి. అయితే ఎందుకు ఎస్సై రివాల్వర్ నుంచి రెండు బుల్లెట్లు బయటకు వ చ్చాయనే సంగతి ఇంకా తేలాల్సి ఉంది. -
కౌన్సెలింగ్ ద్వారా కానిస్టేబుళ్ల బదిలీలు
ఎదులాపురం, న్యూస్‌లైన్ : పోలీసు కానిస్టేబుళ్లకు కౌన్సెలింగ్ ద్వారా బదీలీలు నిర్వహించుటకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు ఎస్పీ డాక్టర్ గజరావు భూపాల్ పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా ఒకే పోలీసుస్టేషన్లో 5 సంవత్సరాలు దాటిన 215 మంది పోలీసు కానిస్టేబుళ్లతో శుక్రవారం స్థానిక పోలీసు కార్యాలయంలో సమావేశమయ్యారు. త్వరలో బదిలీలు నిర్వహించుటకు ఈ కౌన్సెలింగ్ ద్వారా ముందస్తుగా కానిస్టేబుళ్ల కోరిక మేరకు పోలీసు స్టేషన్లను ఎంపిక చేసుకొనుటకు అవకాశం క ల్పించారు. జిల్లాలో ఎస్పీ మొదటిసారిగా కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు నిర్వహించడంపై జిల్లా పోలీసు అధికారుల సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ, ప్రతీ పోలీసు స్టేషన్‌లోని రోజువారీ నేరాల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని పోలీసుల సంఖ్య పెంచుటకు కృషి చేస్తున్నామని చెప్పారు. ట్రాఫిక్ సమస్యలున్న ప్రతీ చోట పోలీసు ఎస్సైలను నియమిస్తామని తెలిపారు. త్వరలో 20 సంవత్సరాలు పూర్తిచేసిన పోలీసు కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించుటకు 3 నెలల శిక్షణకు ఎంపిక చేస్తున్నామని వివరించారు. ఇటీవలే ఖాళీలు ఏర్పడిన హెడ్ కానిస్టేబుళ్లకు, ఏఎస్సైలకు పదోన్నతులు కల్పించే ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, ఆదిలాబాద్ ఏఎస్పీ జోయల్ డేవిస్, ఓఎస్డీ ప్రవీణ్‌కుమార్, మంచిర్యాల డీఎస్పీ ఎం.రమణకుమార్, భైంసా డీఎస్పీ ఆర్.గిరిధర్, నిర్మల్ డీఎస్పీ ఎస్.మాధవ్‌రెడ్డి, కాగజ్‌నగర్ డీఎస్పీ సురేశ్‌బాబు, స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ బి.ప్రవీణ్‌రెడ్డి, కార్యాలయ అధికారి వెంకటరమణ పాల్గొన్నారు. -
జిల్లాలో పనిచేయడం తృప్తినిచ్చింది
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో పనిచేయడం తృప్తి నిచ్చిందని బదిలీపై వెళ్తున్న ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. సికింద్రాబాద్ రైల్వేకు ఎస్పీగా బదిలీ అయిన ఆయనకు బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. నూతన ఎస్పీ గజరావు భూపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా త్రిపాఠి మాట్లాడుతూ జిల్లాలో పనిచేసిన ఈ రెండేళ్ల కాలంలో శాంతిభద్రతలను అదుపులో ఉంచడంలో పోలీసు సిబ్బంది సహకారం మరవ లేని దన్నారు. అనంతరం ఎస్పీ త్రిపాఠి, జేసీ సుజాతశర్మలను పూలమాలలు, శాలువాలతో పోలీసు సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు అప్పారావు, పనసారెడ్డి, ఏఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీలు లతామాధురి, శేష్‌కుమార్, సీఐలు, ఎస్సైలు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఫిర్యాదులపై స్పందిస్తా..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాకు మొదటి పోస్టింగ్‌లో ఎస్పీగా నియామకం కావడం అదృష్టమని, ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తానని డాక్టర్ గజరావు భూపాల్ అన్నారు. సుమారు రెండేళ్లపాటు జిల్లా ఎస్పీగా పనిచేసిన సర్వశ్రేష్ట త్రిపాఠి ఈ నెల 27 సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీగా(పరిపాలన) పనిచేస్తూ పదోన్నతిపై ఆదిలాబాద్ ఎస్పీగా నియమితులైన గజరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. 2008 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందని భూపాల్‌ను ప్రభుత్వం జిల్లా ఎస్పీగా నియమించింది. ఈ మేరకు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఎస్పీ భూపాల్ విలేకరులతో మాట్లాడారు. నక్సల్స్ కట్టడి.. మత ఘర్షణలు లేకుండా చూస్తాం.. ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుశాఖ ప్రథమ కర్తవ్యమని, అయితే నక్సల్స్ కార్యకలాపాల కట్టడి, మత ఘర్షణలకు తావు లేకుండా ప్రత్యేక దృష్టి సారిస్తానని ఎస్పీ గజరావు విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మహారాష్ర్ట-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న జిల్లా గనక అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత చర్యలు చేపడుతామన్నారు. సమస్యలు ఉంటే తనను నేరుగా సంప్రదింవచ్చని, ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి రశీ దులు ఇవ్వాలని పోలీసు అధికారులను ఆదేశిస్తామని ఎస్పీ భూపాల్ పేర్కొన్నారు. జిల్లాపై పూర్తిగా అవగాహన తెచ్చుకుని ప్రజల మనోభావాలకు అనుగుణంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేస్తానన్నారు. కలెక్టర్ , జిల్లా న్యాయమూర్తులను కలిసిన ఎస్పీ బుధవారం మధ్యాహ్నం పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్పీ భూపాల్ కలెక్టర్ అహ్మద్ బాబు, జిల్లా న్యాయమూర్తి జి.గోపాల కృష్ణమూర్తిలను మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలవగా పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. జిల్లా కోర్టు న్యాయమూర్తి గోపాల కృష్ణమూర్తిని కూడా ఎస్పీ మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్పీ జిల్లా జడ్జిని కలిసిన సమయంలో ఆయనతోపాటు జిల్లా అదనపు న్యాయమూర్తులు కె.సునీత, ఎన్.రాజ్‌కుమార్‌లు ఉండగా, జిల్లాలో పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించినట్లు తెలిపారు. ఎస్పీ భూపాల్‌కు అభినందనలు తెలిపిన అధికారులు జిల్లా పోలీసు కార్యాలయంలో నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గజరావు భూపాల్‌ను ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఆయనను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఓఎస్డీ పనసారెడ్డి, అదనపు ఎస్పీలు అప్పారావు (పరిపాలన), ఎన్వీ కిషన్‌రావు, బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ వోరం భాస్కర్‌రావు, ఆదిలాబాద్, బెల్లంపల్లి, నిర్మల్, భైంసా, కాగజ్‌నగర్ డీఎస్పీలు లతామాధురి, ఎం.రవీందర్‌రెడ్డి, వి.శేషుకుమార్, దేవదాసు నాగుల, బి.సురేష్‌బాబులతో ఎస్బీఐ కె.సీతారాములు, ఆదిలాబాద్ పట్టణ సీఐలు గణపతి జాదవ్, నారాయణ, ఉదయ్కిరణ్లతోపాటు పలువురు సీఐలు, ఎస్సైలు, ఏఆర్‌ఐలు ఎస్పీని కలిశారు. కాగా పోలీ సు అధికారుల సంఘం ఆధ్వర్యంలో పోలీసులు, సిబ్బంది ఎస్పీని కలిశారు. -
అంతర్ జిల్లా దొంగ అరెస్టు
తూప్రాన్, న్యూస్‌లైన్: పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 80 తులాల బంగారం ఆభరణాలు, 2 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను అదనపు ఎస్పీ గజరావు భూపాల్ శుక్రవారం తూప్రాన్ డీఎస్పీ కార్యాలయంలో వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు.. దుబ్బాక మండలం ధర్మరాజిపేట గ్రామానికి చెందిన వెంగళి భిక్షపతి, అలియాస్ చిక్కుడు క్రిష్ణ అనే 25 సంవత్సరాల యువకుడు పదవతరగతి ఫెయిలయ్యాడు.అనంతరం ఎలక్ట్రీషియన్ పని నేర్చుకొని 2005లో సిద్దిపేటలో పనిచేశాడు. ఈ సమయంలోనే కరెంటు మోటర్లు దొంగతనం చేసి పోలీసులకు దొరికిపోయాడు. ఈ కేసులో మూడు నెలల జైలు శిక్ష సైతం అనుభవించాడు. అనంతరం మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో దారి దోపిడీ చేసిన కేసులోను జైలుకు పోయాడు. దీంతో అత ని మొదటి భార్యా, రెండవ భార్యా సైతం విడాకులు ఇచ్చి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే భిక్షపతి జల్సాలకు అలవాటు పడ్డాడు. అందుకు అవసరమైన డబ్బుకోసం శివ్వంపేట, తూప్రాన్, నర్సాపూర్, జిన్నారం, రామాయంపేట, చేగుంట, దుబ్బాక, జోగిపేట, సంగారెడ్డి, మండలాలతో పాటు రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలంలోని పలు గ్రామాల్లో ఉదయం పూట సంచరిస్తూ తాళాలు వేసిన ఇళ్లు గుర్తించి రాత్రి వేళ ఆ ఇళ్లలో దూరి చోరీ చేసేవాడు. చోరీసొత్తును అమ్మగా వచ్చిన సొమ్ములతో కార్లలో తిరుగుతూ జల్సా చేసేవాడు. ఆయా చోరీలపై కేసులు నమోదు చేసిన పోలీసులు భిక్షపతికోసం గాలించినా అతను దొరకలేదు. అయితే శుక్రవారం ఉదయం భిక్షపతి శివ్వంపేట బస్టాండ్ వద్ద అనుమానస్పదంగా సంచరిస్తుండడంతో పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు పట్టుకొని ఎస్ఐ నాగేశ్వర్రావుకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్ఐ అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకొని విచారించగా చోరీలు తానే చేసినట్లు భిక్షపతి ఒప్పుకోగా, అతని వద్ద ఉన్న సుమారు 80 తులాల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నర్సాపూర్‌లోని ఎంఎం కోర్టుకు పంపారు. విలేకరుల సమావేశంలో తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ రవీందర్‌రెడ్డి, శివ్వంపేట ఎస్ఐ నాగేశ్వరరావు, పోలీసులు మున్నానాయక్, గోవర్ధన్‌రావు తదితరులు ఉన్నారు. భిక్షపతిని అదుపులోకి తీసుకుని చాలా చోరీల కేసును ఛేదించిన తూప్రాన్ సీఐ ర వీందర్‌రెడ్డి, శివ్వంపేట ఎస్ఐ నాగేశ్వరరావు, ఐడి పార్టీ పోలీసులు గోవర్ధన్‌రావు, మున్యానాయక్లకు అదనపు ఎస్పీ ప్రత్యేక రివార్డులు ప్రకటించారు. భిక్షపతి...చోరీల్లో ఘనాపాటి నిందితుడు భిక్షపతి చోరీల గురించి తెలుసుకున్న పోలీసులే నోరెళ్లబెట్టారు. భిక్షపతి తూప్రాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 8.1 తులాల బంగారు ఆభరణాలు, 18.05 తులాల వెండి ఆభరణాలు, శివ్వంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో 22 తులాల బంగారు ఆభరణాలు, కిలో 18 తులాల వెండి ఆభరణాలను చోరీ చేశాడు. అంతేకాకుండా నర్సాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 4.05 తులాల బంగారు ఆభరణాలు, వెల్దుర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలో 4.05 తులాల బంగారు ఆభరణాలు, 28 తులాల వెండి ఆభరణాలు, చేగుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో 4 తులాల బంగారు ఆభరణాలు, రామాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 6.05 తులాల బంగారు ఆభరణాలు, దుబ్బాక పోలీస్‌స్టేషన్ పరిధిలో 13.05 తులాల బంగారు ఆభరణాలు, 17 తులాల వెండి ఆభరణాలు, జోగిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో 2.04 తులాల బంగారు ఆభరణాలు, సంగారెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2.05 తులాల బంగారు ఆభరణాలు, జిన్నారం పోలీస్‌స్టేషన్ పరిధిలో 0.05 తులాల బంగారు ఆభరణం, రంగారెడ్డి జిల్లా మేడ్చేల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 0.05 తులాల బంగారం ఆభరణం...ఇలా మొత్తం 80 తులాల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి ఆభరణాలు చోరీ చేశాడు. ఈ చోరీ సొత్తును రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో విక్రయించేందుకు వెళ్తున్న క్రమంలోనే పోలీసులకు దొరికిపోయాడు.