ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో పనిచేయడం తృప్తి నిచ్చిందని బదిలీపై వెళ్తున్న ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. సికింద్రాబాద్ రైల్వేకు ఎస్పీగా బదిలీ అయిన ఆయనకు బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. నూతన ఎస్పీ గజరావు భూపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా త్రిపాఠి మాట్లాడుతూ జిల్లాలో పనిచేసిన ఈ రెండేళ్ల కాలంలో శాంతిభద్రతలను అదుపులో ఉంచడంలో పోలీసు సిబ్బంది సహకారం మరవ లేని దన్నారు. అనంతరం ఎస్పీ త్రిపాఠి, జేసీ సుజాతశర్మలను పూలమాలలు, శాలువాలతో పోలీసు సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు అప్పారావు, పనసారెడ్డి, ఏఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీలు లతామాధురి, శేష్‌కుమార్, సీఐలు, ఎస్సైలు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో పనిచేయడం తృప్తినిచ్చింది
Published Thu, Oct 31 2013 4:17 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement