
నిజామాబాద్ అర్బన్: రాజ్యాంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్.. తదితర సంస్థల స్వయంప్రతిపత్తిని కేంద్రం హరిస్తోంద న్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడా నికి పోరాటం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతోందన్నారు.
అసెంబ్లీ ఎన్నికలు జరిగి నెలన్నర దాటినా ఎమ్మెల్యేలు ఇప్పటివరకు పనిచేయడం లేదన్నారు. ఇప్పటి వరకు మంత్రి వర్గ విస్తరణ ఎందుకు చేపట్టలేదో కేసీఆర్ చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన గవర్నర్ అనైతిక రాజకీయాలకు పాల్ప డుతున్నారని విమర్శించారు. రాజ్‌భవన్ అక్రమాలకు అడ్డాగా మారిందన్నారు. గవర్నర్ నరసింహన్ తెలంగాణ వ్యతిరేకి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కనుసన్నల్లో పనిచేసున్నారని విమర్శించారు. సమావేశంలో టీపీసీసీ నాయకు డు మహేశ్‌కుమార్‌గౌడ్, డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హుందాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment