ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజనతో ఏర్పడ్డ నూతన జిల్లాల్లో పోలీస్ కార్యాలయాల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒక్కొక్కదాన్ని 50 వేల ఎస్‌ఎఫ్‌టీతో నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం 11 జిల్లాల్లో మాత్రమే నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కామారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్; కొమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్ జిల్లాలో నిర్మాణాలు జరుగుతున్నాయి. మిగతా జిల్లాల్లో భూ కేటాయింపులపై సందిగ్ధత నెలకొంది.
మొదటి దఫాలో డీపీఓలు...
జిల్లా పోలీస్‌కు కీలకమైన డీపీఓ (డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్)ను మొదటి దఫాలో భాగంగా నిర్మిస్తున్నారు. డీపీఓల నిర్మాణానికి ఒక్కో జిల్లాకు దాదాపు రూ.25 కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తున్నట్టు పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ తెలిపింది. అదే విధంగా రెండో దఫాలో ఎస్పీ క్యాంపు ఆఫీస్‌తో పాటు పరేడ్ గ్రౌండ్, ఆర్మ్‌డ్ రిజర్వ్ భవనం, సిబ్బంది బ్యారక్‌లు నిర్మించాలని నిర్ణయించారు. వరంగల్ కమిషనరేట్ భవన నిర్మాణం సైతం శరవేగంగా కొనసాగుతుండగా, రామగుండం కమిషనరేట్ నిర్మాణానికి సంబంధించి భూ కేటాయింపులు ఇంకా పూర్తికాలేదు. మొత్తంగా మొదటి దఫాలో నిర్మితమవుతున్న డీపీఓల నిర్మాణాలకు రూ. 250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించినట్లు తెలిసింది.
ఫిబ్రవరి కల్లా పూర్తి: ఐజీ మల్లారెడ్డి
ప్రస్తుతం 11 జిల్లాల్లో డీపీఓల నిర్మాణం జరుగుతోంది. ఇంకో మూడు జిల్లాల్లో భూ కేటాయింపులు తేలాల్చి ఉంది. అది కూడా త్వరలోనే క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న డీపీఓల నిర్మాణం వచ్చే జనవరి చివరికల్లా పూర్తి చేసి, ఫిబ్రవరిలో ప్రారంభానికి సిద్ధం చేయాలని ప్రయత్నిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment